ఉన్నత చదువులు, మంచి భవిష్యత్ కోసం అమెరికా వెళ్తున్న తెలుగు విద్యార్థినీవిద్యార్థులు ఊహించని ప్రమాదాల బారిన పడుతున్నారు.కొందరు రోడ్డు ప్రమాదాల బారిన పడుతుంటే మరికొందరు అక్కడి స్థానిక నేరస్తుల చేతితో హతం అవుతున్నారు.దీంతో అమెరికా వెళ్లేందుకు తెలుగు విద్యార్థులు జంకుతున్నారు. పిల్లల భవిష్యత్ బాగుండాలని పేరెంట్స్ అప్పులు చేసి, ఉన్న ఆస్తులు అమ్మి మరి అమెరికా పంపుతే వారి జీవితాలు అర్ధాంతరంగా ముగుస్తుండటంతో ఇక్కడ కన్నపేగు విలవిలలాడుతోంది.
తాజాగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ యువతి అమెరికాలో కనిపించకుండా పోయింది. ఈ విషయం తెలిసి పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కూతురు ఎక్కడ ఉన్నా కనిపెట్టి ఇవ్వాలని స్థానిక తెలంగాణ ప్రభుత్వాన్నివేడుకుంటున్నారు. వివరాల్లోకివెళితే.. అమెరికాలో నల్గొండ యువతి మిస్సింగ్ అయ్యింది. బోస్టన్‌లో చదువుకుంటున్న జిల్లా యువతి శ్రీజ (23) అకస్మాత్తుగా అదృశ్యం అయ్యింది.

ఉన్నత చదువుల కోసం ఏడాది కిందట శ్రీజ అమెరికాకు వెళ్లినట్టు తెలిసింది. చదువుకుంటూనే అక్కడ పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నట్టు సమాచారం. నవంబర్ 2న సాయంత్రం వాకింగ్‌కు వెళ్లిన యువతి.. మరల తిరిగి తన స్టేయింగ్ రూంకు రాలేదు. ఆమె స్నేహితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అమెరికా పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలోని బీచ్ ప్రాంతంలో సెల్‌ఫోన్ లొకేషన్‌ను గుర్తించినట్టు సమాచారం.ఇప్పటికీ శ్రీజ ఆచూకీ లభించలేదని తెలిసింది.
ఒక్కగానొక్క కుమార్తె అమెరికాలో అదృశ్యం కావడంతో నల్లగొండలోని యువతి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీచ్ దగ్గర ఆమె లొకేషన్ ట్రేస్ అవుట్ అయినా ఆమ కనిపించకపోవడంతో ఆత్మహత్య చేసుకుందా? లేదా బీచ్‌లో సరదాగా గడుపుతున్నసమయంలో అలల ధాటికి కొట్టుకుపోయిందా? లేదా ఎవరైనా దుండగులు కిడ్నాప్ చేశారా? అన్న విషయం ఇంకా తెలియ రాలేదు.


