పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ఓజీ2’ నుంచి మేకర్స్ ఒకే ఒక్క ఫొటోను విడుదల చేశారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. చాలా కాలం తర్వాత పవన్ కల్యాణ్ స్టైలిష్ లుక్ లో కనిపించడంలో ఫ్యాన్స్ ఉత్సాహంలో మునిగి తేలుతున్నారు.
కొందరైతే ఏఐకి పని చెప్పి ఆ లుక్ కు తగిన డ్రెస్సింగ్ స్టైల్ ను మారుస్తూ మరిన్ని ఫొటోలను పోస్టులు చేస్తున్నారు. ఈ స్టిల్ తో అభిమానుల్లో ‘ఓజీ2’పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు.












