తెలంగాణ

డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు!

రచన: Desk 22 నిమిషాల పఠనం

పోలీస్ శాఖకు చెందిన కీలక అధికారి, డీఎస్పీ(DSP) ఎస్. భీమ్ రెడ్డి నివాసాలపై ఏసీబీ అధికారులు గురువారం ఉదయం నుంచి మెరుపు దాడులు చేశారు.

తెలంగాణలో అవినీతి తిమింగలాల వేటను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) మరింత ఉధృతం చేసింది. ఆదాయానికి మించిన అక్రమాస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో పోలీస్ శాఖకు చెందిన కీలక అధికారి, డీఎస్పీ(DSP) ఎస్. భీమ్ రెడ్డి నివాసాలపై ఏసీబీ అధికారులు గురువారం ఉదయం నుంచి మెరుపు దాడులు చేశారు.

 ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీ ఖాన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. కేవలం భీమ్ రెడ్డి సొంత నివాసంలోనే కాకుండా, ఆయనకు సంబంధించిన బంధువులు, స్నేహితులు, వ్యాపార భాగస్వాముల ఇళ్లతో సహా తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 20 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ రైడ్స్ కొనసాగుతున్నాయి.

 సోదాల్లో భాగంగా భీమ్ రెడ్డి నివసిస్తున్న విలాసవంతమైన విల్లాను చూసి ఏసీబీ అధికారులే అవాక్కయ్యారు. మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.8కోట్ల రూపాయల విలువైన భారీ విల్లాలో ఆయన నివాసం ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రాథమిక సోదాల్లోనే భీమ్ రెడ్డి పేరిట, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న భారీగా అక్రమాస్తుల డాక్యుమెంట్లు, కీలక పత్రాలు, నగదు మరియు బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

#acb rides#telangana#dspbheemreddy#telanganapolice#telanganacrime
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి