రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు షాకిచ్చాయి. పడిసి, వెండి ధరలు భారీగా పెరిగాయి. రాజధాని హైదరాబాద్ మార్కెట్లో నేడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ఏకంగా రూ.3,770 పెరిగింది. దీంతో ప్రస్తుతం పడిసి రూ.1,44,550కు ఎగబాకింది. అదేవిధంగా 22క్యారెట్ల బంగారం 10గ్రాములకు రూ.3,450 పెరిగింది. ఫలితంగా ప్రస్తుత ధర రూ.1,32,500గా కొనసాగుతోంది.
బంగారంతోపాటే వెండి ధరలూ చుక్కలు చూపిస్తున్నాయి. ఒక్కరోజులోనే కిలో వెండిపై ఏకంగా రూ.5వేలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో ప్రస్తుతం కిలో వెండి రూ.2,50,000 కొనసాగుతోంది. అటు ఢిల్లీలో వెండి ధర రూ.2,45,000గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఒక్కసారిగా ఔన్సుకు సుమారు 39 డాలర్ల మేర పెరిగి 4,064 డాలర్లకు చేరడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడినట్లుగా తెలుస్తోంది.












