క్రైమ్

Duplicate Cigarates : ఈ సిగరేట్స్ అసలే తాగొద్దు.. తాగితే పోతారు!

రచన: Desk 12 నిమిషాల పఠనం

ప్రస్తుతం ఏ వస్తువు కొనాలన్నా జనాలు భయపడుతున్నారు. ఏది చూసినా నకిలీనా? ఒరిజినలా?తెలుసుకోలేకపోతున్నారు.

ప్రస్తుతం ఏ వస్తువు కొనాలన్నా జనాలు భయపడుతున్నారు. ఏది చూసినా నకిలీనా? ఒరిజినలా?తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే నకిలీ వస్తువుల చెలామణీ పెరిగిపోవడంతో ఏది ఒరిజినల్ అనేది గుర్తించడం కష్టంగా మారింది. తక్కువ ధరకు విక్రయిస్తూ జనాలకు నకిలీ వస్తువులను అంటగడుతున్నారు. పప్పులు, ఉప్పులు, కారం, ఆయిల్ ఇలా వంటింటి సామగ్రి మొత్తం కల్తీగా మారుతోంది. తాజాగా సిగరేట్లు సైతం కల్తీగా మార్చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు.

తాజాగా బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ‘గోల్డ్ ఫ్లేక్’ సిగరెట్ల పేరుతో నకిలీ సిగరెట్స్ విక్రయిస్తున్న వారి గుట్టురట్టయింది.బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఎన్‌బీ‌టీ నగర్‌లో శామ్ పాన్ షాపుపై పోలీసులు దాడి చేయగా నకిలీ గోల్ ఫ్లేక్ సిగరెట్స్ పట్టుబడ్డాయి.తీగ లాగితే డొంకమొత్తం కదిలింది. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో నకిలీ సిగరెట్స్ విక్రయిస్తున్న ముఠా గురించి తెలియడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బయట బాక్సు మాత్రమే గోల్డ్ ఫ్లేక్.. లోపల నకిలీ సిగరెట్స్‌తో ధూమపాన ప్రియులను బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్ళు.నకిలీ సిగరేట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సైతం హెచ్చరించారు.

#Duplicate Cigarates#hyderabad#smoking#injurious#Health
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి