అయోధ్య రామాలయంలో భక్తులు సమర్పించిన కానుకల సొమ్ము దొంగతనానికి గురైన విషయం తెలిసిందే. ఈ విషయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనానికి తెరలేపింది. దీనికి బీజేపీ వాళ్లకు సంబంధం ఉందని సమాజ్ వాదీ పార్టీ నేత, ఎంపీ అఖిలేష్ యాదవ్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే యూపీ సీఎం యోగి దేవుడి విరాళాల సొమ్ము మాయం కావడంపై సిట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సిట్ బృందం దర్యాప్తును వేగవంతం చేసింది.తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేవుడి సొమ్మును కాజేసిన వారిలో ఒకరైన అవినాశ్ శుక్లా అనే నిందితుడు పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్టు తెలిసింది. దొంగిలించిన డబ్బును బయటికి తీసుకెళ్లకుండా మరుగు దొడ్లల్లో దాచామని, అనంతరం అక్కడ నుండి బయటికి తరలించామని పోలీసుల విచారణలో శుక్లా అంగీకరించినట్టు తెలిసింది. ప్రస్తుత విచారణ కొనసాగుతుండగా.. త్వరలోనే మరిన్నవిషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.












