స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

High court on Kukatpally land Scam

రచన: Swechaanews Chaiman6 నిమిషాల పఠనం

కూకట్ పల్లి లోని ఐడిఎల్ భూములు తుది తీర్పుకు లోబడే ఉండాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పనులు ఆపేలా స్టే విధించాలన్న పిటిషనర్ వాదనలను పట్టించుకోలేదు. పిటిషనర్ వద్ద అన్ని రికార్డులు ఉన్నా, ప్రభుత్వం వద్ద లేకపోవడంతో , అన్ని అధారాలతో కౌంటర్ దాఖలు చేయాలని మూడు వారాల సమయం ఇచ్చింది.

బై

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

9848070809

కూకట్ పల్లిలోని వివాదస్పద 800 ఎకరాల భూముల్లో హైకోర్టు కీలక వాఖ్యాలు చేసింది. ప్రభుత్వ భూములు అని తెలితే ఇవ్వాల్సిందే ? పద్దతి ప్రకారం డబ్బులు చెల్లిస్తే రిసిప్ట్స్ అందజేయాలని ప్రతివాదులకు అదేశించింది. అప్పటికే ఆర్టీఐతో 1500 ల పేజీలు సమకూర్చిన పిటిషనర్ అందులో ఐడిఎల్ డబ్బులు చెల్లించినట్లు ఎక్కడ సమాచారం లేదు. దీంతో మూడు వారాల్లోగా  రికార్డులు అన్ని సమర్పించాలని జీపీ మురళీధర్ రెడ్డికి అదేశాలు జారీ చేసింది. 1962లో జీవో నెంబర్ 715 తేది: 05-05-1962 ప్రకారం 700 ఎకరాల రిజర్వ్డ్ ఫారెస్ట్ గా గుర్తించారని కోర్టుకు అధారాలు సమర్పించారు. సర్వే నెంబర్ కేటాయించకపోవడంతో ఐడిఎల్ అన్యాక్రాంతం చేసిందని పిటిషనర్ చింతల శ్రీనివాస రెడ్డి తరుపు న్యాయవాధి పాశం కృష్ణరెడ్డి వాదనలు వినిపించారు.

చర్చనీయాంశంగా మారిన స్వేచ్ఛ కథనం.

నగరం నడి ఒడ్డున కూకట్ పల్లి ఏరియాలో 800 ఎకరాల కబ్జాలు పై హైకోర్టులో విచారణ పై ఏ ఒక్క ప్రధాన మీడియా వ్రాయకపోవడంతో స్వేచ్ఛ కథనం చర్చనీయాంశంగా మారింది. పిటిషనర్ ఆ ప్రభుత్వ భూములను కాపాడాలని అన్ని పొలిటికల్ పార్టీల బడా నేతల వద్దకు తిరిగిన పట్టించుకోలేదు. మంత్రులను కలిసినా పెడచెవిన పెట్టారు. భూ విక్రయాలను అడ్డుకోవాలని అధికారులను వేడుకున్నా ,పెద్దలతో పెట్టుకోలేము అంటూ కప్పగంతులు వేశారు. ఏవ్వరు ఏ ఒక్క రోజు కూడా 80 వేల కోట్ల భూ స్కాం పై  కన్నేత్తి చూడలేదు. బిజినెస్ చేసుకుంటున్న ఈ  కంపనీల విలువ ఈ రోజు 3 లక్షల కోట్ల బిజినెస్ చేస్తుంది. దీని పైనే పిటిషనర్ పనులు ఆపాలని కోరినా, తుది తీర్పుకు లోబడి ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వానికి చెందుతుంది. లేదా ప్రయివేట్ వారికి వర్తిస్తుంది. అధారాలు అన్ని 21 రోజుల్లో సమర్పించాలని అదేశించింది హైదరాబాద్ హైకోర్టు.

80 వేల కోట్ల అస్తుల పై జీపీ రెవెన్యూతోనే వాదనలా ?

ప్రభుత్వ భూమి ఎకరం కబ్జా అయితే అడిషనల్ అడ్వకేట్ జనరల్ హాజరయిన రోజులు ఉన్నాయి. కాని ఇక్కడ 1100 ఎకరాల జీవోసిఎల్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి అంటే రెవెన్యూ జీపీ హాజరు అయ్యారని విమర్శలు ఉన్నాయి. అది కూడా అన్ని అధారాలు, పేపర్స్ లేనందున టైం కోరడంతో కోర్టు 3 వారాల సమయం ఇచ్చింది. ప్రతి వాదులకు కూడా మీకు అమ్మిన వారు ఎప్పుడెప్పుడు డబ్బులు ప్రభుత్వ ట్రెజరరీకి చెల్లించారో రిపిస్ట్స్ తో రావాలని సూచించారు. రెవెన్యూ జీపీ మురళీధర్ రెడ్డిని అలినేషన్, అలాట్మెంట్, అక్వాయిర్డ్, తో ఉన్నా భూములు ఎన్నో కంప్లయిటే డీటెయిల్డ్ కౌంటర్ వేయాలని  ధర్మాసనం అదేశించింది.

1500 పేజీల్లో లేని కోనుగోలు పత్రాలు.

1962లో ఎకరం వెయ్యి రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం జీవోలో పెర్కొన్నా, రైతులకు ఆనాటి నుంచి ఈనాటి సెల్ సర్టిఫికేట్ ల వరకు ఇవ్వలేదు. కాని వెయ్యి రూపాయలకు గల్ప్ అయిల్ కార్పోరేషన్ కి కలెక్టర్స్ ఇవ్వవడం పై ఆర్టీఐ ద్వారా 1500 పత్రాల్లో అధారాలు సేకరించారు. జీవోలు , ఉత్తర్వులు ఉన్నాయి కాని ఒక్క రూపాయి ఆనాటి భూములు సొంతం చేసుకునేందుకు డబ్బులు చెల్లించినట్లు లేవు. ఎకరం రూ. 500 లు ఇస్తామని కోర్టులో ఫైట్ చేసిన ఆనాటి ఐడీఎల్ కంపనీ పదకొండు వందల ఎకరాలు కూకట్ పల్లిలో దోచుకుంటున్న వైనం పై కథనాలు వచ్చాయి.

ఖాస్రా లో ఏముందంటే ?

తేది 05-05-1962న విడుదల చేసిన 715జీవో ప్రకారం రిజర్వర్డ్ ఫారెస్ట్ గా 700 ఎకరాలు ఉంది. అందులో నుంచి 200 ఎకరాలు ఐడిఎల్ కి కేటాయించారు. 152 ఎకరాలు గిరిజన, దళితుల వద్ద నుంచి అక్వైర్ చేశారు. ఖాస్రా పహాణీలో సర్వే నెంబర్ 1011/12 ప్రకారం 13.37 ఎకరాల ప్రభుత్వ భూమి అని ఉంది. 1012 లో రంగదాముని చెరువు 3.14 గుంటలు ఉంది. కాని జీవోసిఎల్ కి మొత్తం 181 ఎకరాలుగా పహాణీల్లో కాల క్రమంగా ఎక్కించుకున్నారు. ఐడిఎల్ పొజిషన్ లో మాత్రం 800 ఎకరాల్లో ఉండటంతో, ధరణి మాటున  రిజర్వ్డ్ ఫారెస్ట్ ల్యాండ్ ని మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం మింగేసింది. అమ్మేసిందని పిటిషనర్ చింతల శ్రీనివాస్ వాదన.

వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

ఫోటోలు

తర్వాత చదవండి