రాజకీయాలు

గ్రామీణ కూలీలకు శుభవార్త చెప్పిన కేంద్రం!..

రచన: Desk 22 నిమిషాల పఠనం

వీబీ జీరామ్‌జీ వేతనాల పెంపునకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను కేంద్రం తాజాగా నోటిఫై చేసింది.

దేశంలోని గ్రామీణ కూలీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్తగా 'వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్–గ్రామీణ్' చట్టం నేటి నుంచి అమల్లోకి తీసుకువచ్చింది.

ఈ కొత్త చట్టం ప్రకారం.. ఇంతవరకు ఉన్న 100 రోజుల ఉపాధిని 125 రోజులకు పెంచారు. అలాగే రోజువారీ కూలీని రూ.300 నుంచి రూ.409 వరకు నిర్ణయించగా, సిక్కింలోని కొన్ని పంచాయతీల్లో రూ.450 వరకు చెల్లించనున్నారు.

మరోవైపు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, బిహార్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కూలీల వేతనాలు 15 శాతానికి పైగా పెరిగాయి. ఇక తెలంగాణలో రోజుకు రూ.308, ఆంధ్రప్రదేశ్‌లో రూ.312 చెల్లించనున్నారు.

కర్ణాటకలో రూ.382, కేరళలో రూ.401, గోవాలో రూ.406 వేతనంగా నిర్ణయించారు. గ్రామీణ కూలీలకు నిరంతర ఉపాధి, మెరుగైన ఆదాయం కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

#VB-G RAM G Act#bjp#telangana#andhara#central govt
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి