స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

Kukatpally 800 Acrs Scam blasting

రచన: Super Admin12 నిమిషాల పఠనం

80 వేల కోట్ల భూ స్కాంకి పాల్పడ్డ బడాబాబులు. అలీబాబా 40 దొంగలు లా పంచుక తిన్న వైనం.

  • 
హైకోర్టుకు చేరిన గల్ఫ్ ఆయిల్

  • భూ దందా వ్యవహారం.

  • 
ఆనాటి బీఆర్ఎస్ సర్కార్ తీరుతో నెలల

  • వ్యవధిలోనే వేల కోట్లు కొట్టేశారు.

  • 
కాంగ్రెస్ వచ్చాక వాటాలు పంచుకుని పట్టించుకోని నేతలు.?

  • 
ఆధారాలు చూపినా నోరెత్తని బీజేపీ పార్టీ.


  • చింతల శ్రీనివాస్ రెడ్డి పిటిషన్‌తో

  • మొత్తం వ్యవహారం బట్టబయలు.


  • విచారణ చేపట్టిన జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్.


  • అధారాలతో అశ్చర్యం వ్యక్తం చేసిన ధర్మాసనం.


  • ఆనాటి కలెక్టర్ హరీష్, అమోయ్ కుమార్‌ల విచ్చలవిడితనానికి నిదర్శనం ?


  • మొత్తం ఉన్నదే 200 ఎకరాలు,

  • అమ్మింది 800 ఎకరాలు?


  • 2008 లో ధాన కిశోర్, 2016లో రఘునందన్ రావుల

  • రిపోర్టులను తొక్కిపెట్టిన బీఆర్ఎస్.


  • 2002లో ఐడీఎల్ కంపెనీ క్లోజ్.

  • 
అక్రమంగా భూమి అక్రమించుకునేందుకే

  • 2008లో గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్‌గా అవతారం.

  • 
2009లో నాలెడ్జ్ పార్క్ కడుతామని అప్లికేషన్.

  • ఐటీ కంపెనీల ఏర్పాటు కోసమే యాగా అసోసియేట్స్‌కి 2 సేల్ డీడ్స్.

  • 
సీబీఐ విచారణ, ఈడీ జప్తు జరిగినా ?

  • బరితెగించిన బీఆర్ఎస్ సర్కార్‌ అమ్మకాలు.

  • 
వెయ్యి రూపాయలకే ఎకరంగా సేల్ సర్టిఫికేట్ ఇచ్చిన

  • కలెక్టర్ హరీశ్ రెడ్డి, రూపాయి తీసుకోని అమోయ్ కుమార్.

  • 100 ఎకరాల పేరుతో మొత్తం 861 ఎకరాలకు

  • రిజిస్ట్రేషన్ చేయించుకున్న హిందుజా,

  • వాటి తోడు దొంగల రియల్ కంపెనీలు.


  • 
సర్వే నంబర్ లేని 700 ఎకరాల మిగులు భూమిని

  • 1962లోనే కబ్జా చేసిన ఐడీఎల్.


  • 2023లోనే ఫినిక్స్ భూ ఫిక్సింగ్ అంటూ బయటపెట్టిన

  • స్వేచ్ఛ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల.

  • 
తాజాగా హైకోర్టులో విచారణతో

  • సంచలనంగా మారిన వైనం.

  • సిబిఐకి ఈ భారీ ల్యాండ్ స్కాం కేసు ఇచ్చే దమ్ముందా ?

బై

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

9848070809

స్వేచ్ఛ న్యూస్ చైర్మన్

కూకట్‌పల్లి 80 వేల కోట్ల భూములు?

1962లో ఐడీఎల్ కంపెనీ స్థాపించేందుకు భూ సేకరణ చేశారు. ఇందుకు బంజారా ఫ్యామిలీ నుంచి 110 ఎకరాలు, హరిజనుల నుంచి 33 ఎకరాలు, మిగితా కుమ్మరి బాలయ్య కుటుంబం నుంచి 65 ఎకరాలు. పట్టా భూమి 65 ఎకరాలకు ఆనాడు వెయ్యి రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం చెప్పినా, కంపెనీ ఇవ్వలేదు. కోర్టుల్లో కేసులు వేసుకుని విసిగిపోయారు రైతులు. ఇదే అదునుగా రైతులకు కేటాయించిన భూముల కంటే ఎక్కువగా మిగులు భూమిలో కబ్జా చేసుకుని సుమారు 1100 ఎకరాల్లో ఐడీఎల్ కంపెనీ పహారీ నిర్మించుకుంది. రానురాను రికార్డులు మారిపోయాయి. ఇది కాకుండా ఊదాసీన్ మఠ్ వద్ద లీజుకు తీసుకున్న 538 ఎకరాలు ఉన్నాయి. సుప్రీం కోర్టు తీర్పుతో మఠ్ భూములు సేఫ్ జోన్‌లో ఉన్నాయి. కానీ సేకరించిన భూమితో పాటు కబ్జా చేసిన భూములను కాజేసిన తీరు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఇండియాలోనే ఇంత పెద్ద భూ స్కాం జరిగలేదేమోనని అశ్చర్యపోతారు.

స్కాంకి తెరలేపింది ఇలానే?

2002లో ఐడీఎల్ కంపెనీ మూత పడింది. కానీ 1100 ఎకరాల కంటే పైగా ప్రైమ్ ల్యాండ్ ఉంది. దీన్ని అక్రమించుకునేందుకు గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్‌గా మార్చారు. 2008లో ఈ భూముల్లో ఐటీ పార్క్ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేస్తామని అప్లికేషన్ పెట్టారు. నాన్ ఇండస్ట్రియల్ జోన్‌గా మార్చేందుకు విజయ్ సాయి రెడ్డికి అప్పగించారు. కానీ అప్పటి కలెక్టర్ ధాన కిశోర్ ఆ భూములు ప్రైమ్ ప్రాపర్టీగా ఉన్నాయని, ఏపీఐఐసీకి అప్పగించాలని సీసీఎల్ఏకి లేఖ వ్రాశారు. ఈ కంపెనీకి సిటీ అవతల ఇవ్వొచ్చని సూచించారు. కానీ ఆ ప్రభుత్వం పట్టించుకోకపోగా..? జీఓ నెం.302/2009 ప్రకారం యాగ అసోసియేషన్‌కి 2 సేల్ డీడ్స్ చేశారు. జగన్ పై సీబీఐ దర్యాప్తులో ఈ విషయం పొక్కింది. ఈడీ వీటి పై సేల్ డీడ్స్ కొనసాగవద్దని లేఖ వ్రాశారు. అస్తులను జప్తు చేశారు. అప్పటికే హిందుజాకి 76 ఎకరాలు, స్వోయిర్ స్పెస్‌కి 11 ఎకరాలు వచ్చేలా స్కెచ్ వేశారు. బీఆర్ఎస్ సర్కార్ వచ్చాక రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్ రావు ఈ భూములపై పూర్తి నివేదిక అందజేశారు. చుట్టూ హౌసింగ్ బోర్డు భూములు ఉన్నాయి. లోథా లాంటి భారీ భవంతులు నిర్మించింది. ఎకరం 20 కోట్లు పలుకుతుంది. దీన్ని టీఎస్‌ఐఐసీకి బదిలీ చేయాలని లేఖ ఇచ్చారు. వీటన్నింటిని పక్కకు పెట్టేశారు. 2021లో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌గా హరీష్ రెడ్డి రావడంతో 100 ఎకరాలకు 29-10-2021న 81 ఎకరాలు అక్వైర్డ్ ల్యాండ్ అని, 18 ఎకరాలు అలియనేషన్ అని సేల్ సర్టిఫికేట్లు ఇచ్చేశారు. మళ్లీ 28 ఎకరాలు అలియనేషన్ అంటూ రూ. వెయ్యి కట్టించుకుని సేల్ సర్టిఫికేట్ ఇచ్చారు. అసలు ఎంత తీసుకున్నారో హైకోర్టు ప్రశ్నించింది. బుధవారం విచారణకు తెలియజేయాలని ఆదేశించింది.

100 ఎకరాల సేల్ సర్టిఫికేట్‌తో 861 ఎకరాల రిజిస్ట్రేషన్ .

29-10-2021న సేల్ సర్టిఫికేట్‌తో జనవరిలో 11 ఎకరాలను 69 కోట్లకు హిందుజా ప్రాపర్టీకి అమ్మకం జరిపారు. ఏప్రిల్‌లో 5 ఎకరాలు 60 కోట్లకు విక్రయించారు. మళ్లీ ఏ 4.30 గుంటలు 143 కోట్లకు అమ్మారు. మేలో 178 కోట్లకు 250 ఎకరాలు అమ్మకం జరిపారు. అక్టోబర్‌లో 258 ఎకరాలు 466 కోట్లకు ఇచ్చేశారు. 100 ఎకరాలకు సేల్ సర్టిఫికేట్ తీసుకొని హరీష్ 527 ఎకరాలు అమ్మేశారు. షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ ఏలో 100 ఎకరాలు, బీలో 76 ఎకరాలు, సీలో 46 ఎకరాలు, డీలో 32 ఎకరాలు, ఈలో 8 ఎకరాలు, ఎఫ్‌లో 3 ఎకరాలు, ఇలా ఒకే ఏడాదిలోపు 265 ఎకరాలు అమ్మేశారు. మళ్లీ మూడు నెలల తర్వాత 262 ఎకరాలు అమ్మేశారు. ఇలా 800 కోట్లు సంపాదించింది హిందుజా దాన్ని అనుబంధ సంస్థలు, బీఆర్ఎస్ బినామీ సంస్థలు. 2023లో నవీన్ మిట్టల్ సీసీఎల్ఏ నుంచి ఈ భూమి పై ప్రభుత్వానికి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని అప్పటి మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్‌కి లేఖ వ్రాశారు. దీంతో అమోయ్ కుమార్ మరో 333 ఎకరాలకు ఒక్క రూపాయి తీసుకోకుండానే సేల్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. అలియనేటెడ్ అని జీఓలో వ్రాశారు. అంటే అమ్మకానికి ఒక ప్రొసీడింగ్ ఉంటుంది. దీనికి ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిటీకి రిఫర్ చేయాలి. మార్కెట్ రేట్ ఫిక్స్ అయ్యాక, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్లు ప్రచురించాలి. ఆ తర్వాత ప్రభుత్వ ట్రెజరీలో డబ్బులు కట్టినట్లు చూపించాలి. అప్పుడే స్థానిక తహసీల్దార్ కన్వెయెన్స్ డీడ్ చేయాలి. ఇండస్ట్రియల్ పర్పస్‌కి ఇచ్చిన భూమిని టీజీఐఐసీకి ఇవ్వాల్సింది పోయి..? కనీసం రైతులకు కూడా డబ్బులు ఇవ్వకుండా ఎగవేసిన ఐడీఎల్ కంపెనీ పై కోర్టులో కొట్లాడి సాధించుకోవాల్సిన భూమి పై 1100 ఎకరాల భూమిని కొట్టేసేందుకు భారీ స్కెచ్ వేశారు. కానీ ఉదాసీన్ మఠ్ భూమిని కాపాడుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భూమిని కాపాడలేక పోగా 80 వేల కోట్ల ప్రజా ధనాన్ని ప్రైవేట్ పాలు చేశారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఏర్పాటు చేయాల్సింది పోయి..? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు.

స్టాక్ ఎక్స్‌చేంజ్‌కి లేఖలతో మాయ?

ఫినిక్స్ సిస్టర్ సంస్థ అయిన స్వోయిర్ స్పెస్ ఇన్‌ఫ్రా సంస్థ పెద్ద మొత్తంలో భూములు అమ్ముతున్నట్లు ప్రకటనల్లో ఇచ్చుకున్నారు. 3400 కోట్లు వస్తున్నాయని తెలిపి మాయలతో అంతా ప్రైవేట్ అనే కలరింగ్ ఇచ్చారు. ఫారెస్ట్ ల్యాండ్‌ని అక్రమంగా కబ్జా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సర్వే నంబర్ లేకుండా చేశారు. ఎక్స్‌ట్రా 700 ఎకరాల భూమి ఉండటంతో సేల్ సర్టిఫికేట్ల కంటే ఎక్కువగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. 1011/12, 1013/3 సర్వే నంబర్లలో మాత్రమే ప్రభుత్వ భూమి ఉండేది. మిగితాది కొట్లాడితే 2021 నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది.

సీబీఐ దర్యాప్తుకి ఆదేశిస్తుందా?

ఈ భారీ ల్యాండ్ స్కాంలో హైకోర్టులో చింతల శ్రీనివాస్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. రిట్ పిటిషన్ నెం. 15167/2026 బెంచ్ మీదికి రాకుండా చాలా మంది ప్రయత్నాలు చేశారు. సోమవారం, మంగళవారం విచారణలో నివ్వరపోయే విషయాలు తెలిశాయి. బుధవారం 2.15 నిమిషాలకు మళ్లీ విచారణ చేయనుంది ధర్మాసనం. అయితే ఈ స్కాం జరిగిన తీరుని 2023లో అనాటి తొలివెలుగు లో క్రైం బ్యూరో కలం పేరుతో దేవేందర్ రెడ్డి సంచలన కథనాలు వ్రాశారు. ఆనాడు ఎవ్వరు పట్టించుకోలేదు. ఈనాడు హైకోర్టు విచారణతో మరోసారి సంచలనంగా మారింది. ఈ కేసు సీబీఐకి అప్పగిస్తే, ప్రభుత్వానికి చెందాల్సిన భూమిని ఎలా లక్షల కోట్ల వ్యాపారంగా మారిందో తెలుస్తుంది. ఆనాటి ఎంపీ ఈనాటి సీఎం రేవంత్ రెడ్డికి ఎంత వాటా వెళ్లింది. బీఆర్ఎస్ నేతల బ్యాగులో ఎన్ని కంపెనీలు బినామీగా ఉన్నాయి. ఇప్పుడు మంత్రి పొంగులేటి, బట్టికి వాటాలు ఎంత ముట్టాయి. సైలెంట్‌గా ఉన్న బీజేపీకి షేర్లు పంచింది ఎవ్వరో అన్ని తెలిసిపోతాయి. ఎవ్వరు నోరు మేదపకుండా ఉండేందుకు నాయకులు అలీబాబా 40 దొంగలలా పంచేసుకున్నారు. మీడియాకు కూడా ఇష్టానుసారంగా యాడ్స్ ఇస్తూ ఇప్పుడు నిర్మాణాలు కొనసాగిస్తున్న హానర్ హోమ్స్ వార్తలు రాయకుండా అడ్డుకుంటుంది. కానీ స్వేచ్ఛాయుతంగా స్వేచ్ఛ న్యూస్ మీకు వరస కథనాలు మళ్లీ ధైర్యంగా మీ ముందు ఉంచుతుంది

#LAND SCAM in Kukatpally
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

ఫోటోలు

తర్వాత చదవండి