స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొందరు జాతీయ జెండాను అవమానపరిచే విధంగా వ్యవహారించారని సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని చోట్ల త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించే క్రమంలో తప్పులు దొర్లడం, మరికొందరు జతీయగీతం ఆలాపన సందర్భంగా కనీస మర్యాద పాటించకుండా వ్యహరించారని, కేవలం మౌనంగా నిలబడ్డారని, ఆలాపించడం లేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి.
అయితే, ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు. అందుకే దేశవ్యాప్తంగా జాతీయ జెండాలను ఆవిష్కరించి రెండు వందల ఏళ్ల పాటు దేశాన్నిపరిపాలించిన బ్రిటీషర్స్‌కు వ్యతిరేకంగా దేశంలోని ప్రజలంతా ఏకమై స్వాతంత్ర్యం కోసం ఎలా పోరాడారు? అని నేటి తరానికి టీచర్లు, సీనియర్లు తెలియజేయడం, గుర్తుచేసుకోవడం వంటివి చేస్తుంటారు. గుండెల నిండా జాతీయతను నింపుతారు. అంతటి ఘనత ఉన్న స్వాతంత్ర్య దినోత్సవం రోజున కొందరు అధికారులు వ్యహరించిన తీరుపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏపీలోని అల్లూరి జిల్లా చింతపల్లిలోని APFDC కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అధికారులు వింతగా ప్రవర్తించారు. జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం దేశభక్తి గీతాలకు బదులుగా ‘రాను బొంబాయికి రాను’ వంటి సినిమా, జానపద పాటలకు అధికారులు స్టెప్పులు వేశారు. మువ్వన్నెల జెండా నీడన వినోద నృత్యాలు చేయడంపై స్థానికులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యతను విస్మరించి ప్రవర్తించిన APFDC అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఓ అధికారి.. ‘రోస్ రోస్ రోజా పువ్వా’ పాటకు డ్యాన్స్ చేస్తుండగా.. పక్కనే ఉన్న తోటి మహిళా అధికారిణులు చప్పట్లతో ఎంకరేజ్ చేయడం, మరో మహిళా అధికారిణి సైతం స్టెప్పులు వేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా, దీనిపై ఉన్నతాధికారులు ఇంకా స్పందించలేదు.
https://x.com/RTVnewsnetwork/status/2088796326997946539?s=20


