క్రైమ్

Viral : దోచుకుందామని వెళ్లి ఫుల్లుగా తాగేసి..ఏం చేశారంటే? (వీడియో)

రచన: Kumar••3 నిమిషాల పఠనం

దొంగతనానికి వెళ్లిన దొంగలు దోచిన సొత్తును తీసుకోని వెళ్లిపోవడం కామన్. కానీ, ఇటీవల కొందరు దొంగలు దోచుకున్న చోటే కడుపు నింపుకుంటున్నారు.అదే ఇంట్లో తినడంతో పాటు తాగేసి అక్కడే తొంగుంటున్నారు. ఇదే వారిని ఊచలు లెక్కబెట్టేలా చేస్తున్నది. తాజాగా ఇలాంటి ఘటనే రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో వెలుగుచూసింది.

దొంగతనానికి వెళ్లిన దొంగలు దోచిన సొత్తును తీసుకోని వెళ్లిపోవడం కామన్. కానీ, ఇటీవల కొందరు దొంగలు దోచుకున్న చోటే కడుపు నింపుకుంటున్నారు.అదే ఇంట్లో తినడంతో పాటు తాగేసి అక్కడే తొంగుంటున్నారు. ఇదే వారిని ఊచలు లెక్కబెట్టేలా చేస్తున్నది. తాజాగా ఇలాంటి ఘటనే రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లిలో అర్థరాత్రి సమయంలో ఓ దాబాలో ఐదుగురు దుండగులు దొంగతనానికి వెళ్లారు.మొదట విలువైన సామగ్రి దోచుకుని పారిపోయిన దొంగలు.. మరల మిగిలిన సొమ్ము కోసం మళ్లీ అదే దాబాకి తిరిగొచ్చారు. అదే క్రమంలో వారికి ఈసారి అక్కడ మద్యం కనిపించింది. దీంతో మందు తాగేసి సొమ్ము దోచుకెళ్దామని దుండగులు అనుకున్నారు.

కక్కుర్తి పడి మద్యం ఎక్కువగా తాగేయడంతో మత్తెక్కి దాబా ప్రాంగణంలోనే దొంగలు నిద్రపోయారు.అయితే, ఉదయం దాబా యజమాని అక్కడకు వెళ్లి చూడగా.. షాపు తాళాలు వేసి ఉన్నాయి. కానీ, షెటర్ తెరిచి చూడగా పైనుంచి సీలింగ్ డ్యామేజ్ చేసి ఉండటం గమనించిన యజమాని మొత్తం చెక్ చేయగా.. అక్కడే దొంగలు కవర్ వేసుకుని నిద్రపోవడానికి గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. నిద్రపోతున్న దొంగలను వీడియో తీయగా.. ప్రస్తుతం అది కాస్త మెయిన్ స్ట్రీమ్, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దోచుకున్న సొమ్ముతో తాగేసి పడుకుంటే అపోవు కదా? అని కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మద్యం పట్ల అంత కక్కుర్తి పనికిరాదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

https://x.com/pulsenewsbreak/status/2088872503934677373?s=20

#robbers#drunk#slept#chori place#kammam#crime
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి