తెలంగాణ

BRS : ప్రోటోకాల్ రగడ.. సూర్యాపేటలో మాజీ మంత్రి వర్సెస్ మంత్రి!

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో మరోసారి ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. అధికారపార్టీ ఏదైనా ఒక నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమం చేపడితే సదరు నియోజకవర్గ ఎమ్మెల్యే మనోడైనా, కాకపోయినా ఇన్విటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి తోడు అక్కడ ఏర్పాటు చేసిన శంకుస్థాపన బోర్డు, శిలాఫలకంలో సదరు ఎమ్మెల్యే పేరు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

రాష్ట్రంలో మరోసారి ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. అధికారపార్టీ ఏదైనా ఒక నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమం చేపడితే సదరు నియోజకవర్గ ఎమ్మెల్యే మనోడైనా, కాకపోయినా ఇన్విటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి తోడు అక్కడ ఏర్పాటు చేసిన శంకుస్థాపన బోర్డు, శిలాఫలకంలో సదరు ఎమ్మెల్యే పేరు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ, సూర్యాపేట నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటు సెల్యూట్ బేస్ శిలాఫలకంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేరు వేయలేదని సమాచారం.

దీంతో బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. అధికార పార్టీ నేతలు కావాలనే తమను కించపరుస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో నూతనంగా నిర్మించిన సెల్యూట్ బేస్ శిలాఫలకంపై స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పేరు కనిపించలేదు. ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సెల్యూట్ బేస్‌ను ప్రారంభించారు.

అయితే, మంత్రి ఉత్తమ్ ప్రారంభించిన సెల్యూట్ బేస్ శిలాఫలకంపై డీజీపీ సీవీ ఆనంద్, మల్టీ జోన్ ఐజీ, డిప్యూటీ ఐజీల పేర్లు, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ ఇతర కిందిస్థాయి అధికారుల పేర్లు కనిపిస్తుండగా స్థానిక ఎమ్మెల్యే పేరు పెట్టకపోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని మర్చిపోయారా? అంటూ పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. దీనికి బాధ్యులపై చర్యలు చేపట్టి భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశాయి. కాగా, ఈ విషయం మంత్రి ఉత్తమ్‌కు తెలిసే జరిగిందా? లేదా? సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

https://x.com/TeluguScribe/status/2088886623253741593?s=20

#protocal#minister uttam kumar reddy#mla jagadish reddy#BRS#Congress#suryapet
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి