సినిమా

Vishwanath And Sons: సూర్య మాస్ రాంపేజ్ 2 రోజుల్లో 100 కోట్ల కలెక్షన్స్

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Vishwanath And Sons: కోలీవుడ్ హీరో సూర్యకి ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. తమిళంలో ఉన్న అగ్ర హీరోల్లో సూర్య ఒకరు. సూపర్ స్టార్ రజినీకాంత్, విజయ్ తలపతి, సూర్య, ధనుష్, అజిత్ కుమార్, కార్తి..వీరందరికీ ఒకే క్రేజ్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో రజినీకాంత్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకుంటున్నారు. సూర్య గత కొంతకాలంగా ఆశించిన విజయాలను అందుకోలేదు.

దీంతో, మంచి కథను ఎంచుకోవాలనుకున్న సూర్య, టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో విశ్వనాథ్ అండ్ సన్స్ అనే సినిమాను చేశాడు. ఈ సినిమాను సూర్య దేవర నాగవంశీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించాడు. మమిత బైజు హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా రిలీజైన 2 రోజుల్లోనే 100 కోట్ల మార్క్‌ను చేరుకొని సెన్షేషనల్ హిట్‌గా నిలిచింది.

Vishwanath And Sons: సూర్య మాస్ రాంపేజ్ 2 రోజుల్లో 100 కోట్ల కలెక్షన్స్

వాస్తవానికి, ఈ రేంజ్ హిట్ అవుతుందని మేకర్స్ భావించలేదు. దీనికి, కారణం ఎంత కాదన్న కోలీవుడ్ హీరోలకి తమిళంలో ఉండే క్రేజ్ కంటే తెలుగులో కాస్త తక్కువే ఉంటుంది. ఇక్కడ, బ్యానర్ క్రెడిబులిటీ, డైరెక్టర్ క్రెడిబులిటీ మాత్రమే తప్ప హీరో క్రేజ్ అంతగా ప్రభావం చూపదు. అలాంటిది, సూర్య ఇమేజ్ మాత్రం ఇక్కడ రివర్స్‌లో పనిచేసింది. సూర్య పర్ఫార్మెన్స్ వల్లే ఈ సినిమా హ్యూజ్ కలెక్షన్స్ రాబడుతోంది.

కంప్లీట్ క్లాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా సూర్య కెరీర్‌లో మంచి మూవీగా నిలవడం గ్యారెంటీ అని చెప్పుకుంటున్నారు. గత చిత్రాలు పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చాయి. కానీ, సూర్యకి ఆశించిన విజయాలను మాత్రం ఇవ్వలేదు. కానీ, ఇప్పుడు వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ మాత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది. వెంకీ అట్లూరి మార్క్ కథ అందరినీ బాగా ఆకట్టుకుంటోంది.

#surya#vishwanathandsons#venkey atluri#mamitha baiju
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి