సినిమా

Trivikram: సూర్యతో సినిమా ఉంటుంది కానీ!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Trivikram: మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పెన్ను నుంచి వచ్చే పంచ్ డైలాగుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎమోషనల్ సీన్స్‌లో బరువైన మాటల గురించి అదే పనిగా మాట్లాడనవసరం లేదు. ఊతపదాలకి, ప్రాంతీయ భాషలలోని పదునైన పదాలకి అర్థాలను వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఆయన ఏది రాసిన అర్ధవంతంగా అందరికీ అర్థమయ్యేలా రాస్తాడు. అందుకే, ఆయన గురూజీ.

Trivikram: మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పెన్ను నుంచి వచ్చే పంచ్ డైలాగుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎమోషనల్ సీన్స్‌లో బరువైన మాటల గురించి అదే పనిగా మాట్లాడనవసరం లేదు. ఊతపదాలకి, ప్రాంతీయ భాషలలోని పదునైన పదాలకి అర్థాలను వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఆయన ఏది రాసిన అర్ధవంతంగా అందరికీ అర్థమయ్యేలా రాస్తాడు. అందుకే, ఆయన గురూజీ.

ఈ గురూజీ ప్రస్తుతం, విక్టరీ వెంకటేష్‌తో 'ఆదర్శ కుటుంబం' అనే సినిమా చేస్తున్నాడు. ఇది, అటు త్రివిక్రమ్ మార్క్ ఇటు వెంకీ మార్క్ కలగలిపి తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే, షూటింగ్ దాదాపు పూర్తైంది. అక్టోబర్ 2న ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. వెంకీ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే, వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి అంచనాలను క్రియేట్ చేశాడు.

ఇక, దీని తర్వాత ఎన్‌టిర్ హీరోగా ఒక సినిమాను చేయాల్సి ఉంది. సుబ్రమణ్యస్వామి కథతో 'గాడ్ ఆఫ్ వార్' అనే టైటిల్‌తో ఈ సినిమాను రూపొందించనున్నాడు త్రివిక్రమ్. ఎన్‌టిర్ 'డ్రాగన్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో గాయమై ఇటీవల సర్జరీ జరిగింది. అక్టోబర్ వరకూ తారక్ షూటింగ్ సెట్స్ కి వచ్చే ఛాన్స్ లేదు. దీంతో, ఈ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యం అవుతోంది. అయితే, తాజాగా..త్రివిక్రమ్ చేసిన కామెంట్స్ చూస్తే నెక్స్ట్ సినిమా సూర్యతో ఉండబోతుందనిపిస్తోంది.

త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, నాగవంశీ నిర్మాతలుగా విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా వచ్చి..భారీ హిట్ సాధించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో త్రివిక్రమ్ సూర్యతో ఒక సినిమా అనుకున్నాను. కానీ, కుదరలేదు. గ్యారెంటీగా ఆయనతో ఓ సినిమాను చేస్తాను అంటూ వీరి కాంబో మూవీపై హింట్ ఇచ్చాడు. దీన్ని బట్టి చూస్తే గాడ్ ఆఫ్ వార్ గనక ఆలస్యం అయితే, సూర్య రెడీగా ఉన్నాడు కాబట్టి ఆయనతో త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాను చేయడానికి ప్లాన్ చేస్తున్నటుగా తెలుస్తోంది. ఏదేమైనా, కాస్త ఆలస్యం అయినా త్రివిక్రమ్, సూర్యల కలయికలో సినిమా కన్‌ఫర్మ్.

#trivikram#suriya#tollywood#kollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి