సినిమా

Trisha Krishnan: టాలీవుడ్‌పై పెట్టుకున్న ఆశలన్నీ గల్లంతేనా?

రచన: Anshu•••4 నిమిషాల పఠనం

Trisha Krishnan: త్రిష కృష్ణన్..తెలుగు, తమిళ భాషలలో ఒకప్పుడు యమా క్రేజ్ ఉన్న హీరోయిన్. నీ మనసుకు నాకు తెలుసు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ చెన్నై బ్యూటీ, అతికొద్ది కాలంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. తెలుగులో ప్రభాస్ సరసన నటించిన వర్షం సినిమాతో కమర్షియల్ హీరోయిన్‌గా మారింది.

చిరంజీవి, మహేష్ బాబు, రవితేజ, బాలకృష్ణ, నాగార్జున, ఎన్‌టిర్, తరుణ్, వెంకటేష్..ఇలా దాదాపు అందరు హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. తమిళంలో కూడా సూర్య, అజిత్, విజయ్ సేతుపతి, కారి లాంటి వారితో రొమాన్స్ చేసింది. అయితే, గత కొంతకాలంగా త్రిషకి తెలుగులో హీరోయిన్‌గా అవకాశాలు రావడం లేదు. పవన్ కళ్యాణ్ తో తీన్ మార్ ఫ్లాప్ తర్వాత మళ్ళీ కనిపించలేదు.

అయితే, మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'లో నటిస్తోంది. మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇస్తున్న త్రిష, చాలా నమ్మకాలు పెట్టుకుంది. కానీ, ఈ సినిమా ఎప్పటికప్పుడు రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. దసరా పండుగ సందర్భంగా రిలీజ్ అంటున్నారు. 'విశ్వంభర' రిలీజై హిట్ సాధిస్తే టాలీవుడ్ నుంచి మరిన్ని ఛాన్సులు వస్తాయని ఆశపడింది.

Trisha Krishnan: టాలీవుడ్‌పై పెట్టుకున్న ఆశలన్నీ గల్లంతేనా?

కానీ, ఆ ఆశలన్నీ, గల్లంతైయ్యేలా పరిస్థితి కనిపిస్తోంది. దీనికి, కారణం 'విశ్వంభర'పై కాస్త నెగిటివిటీ ఉండటమే. ఈ సినిమా అవుట్‌పుట్ చిరంజీవికే తృప్తిగా అనిపించలేదట. ఆల్రెడీ గతంలో చిరంజీవితో 'స్టాలిన్' సినిమా చేసిన త్రిషకి, ఆ మూవీ ఫ్లాప్ ఇంపాక్ట్ అలాగే ఉంది. ఇప్పుడు, 'విశ్వంభర'తో మళ్ళీ జోడీ కట్టిన త్రిష.. హిట్ అందుకోవాలని ఆశపడితే, అది నెరవేరేలా కనిపించడం లేదు.

కానీ, ఒక్కసారి టైమ్ గనక కలిసివస్తే సీనియర్ హీరోలందరికీ సరిపోయే ఫిజిక్‌తో అందంగా ఉన్న త్రిషకి, వరుసగా అవకాశాలు వస్తాయనడంలో సందేహమే లేదు. ఏదేమైనా 'విశ్వంభర' మూవీ సక్సెస్‌పైనే త్రిష టాలీవుడ్ కంబ్యాక్ ఆధారపడి ఉంది.

#Trisha Krishnan#Vishwambhara#Chiranjeevi#Mallidi Vasishtha
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి