Anupama Parameswaran: సినిమా ఇండస్ట్రీలో కో స్టార్స్ గురించి కొందరు చాలా గొప్పగా చెబుతుంటారు. సినిమా ఛాన్స్ కోసం కొందరు ఇలాగే చెప్తారులే అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక హీరోయిన్ గనక వేరే హీరో గురించో, దర్శక నిర్మాత గురించో మాట్లాడితే, ఆమె ఖచ్చితంగా వాళ్ళ నుంచి సినిమా ఛాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తుందని అంటారు..ఇందులో సందేహమే లేదు.
అదే, ఒక హీరో గానీ దర్శక నిర్మాత గానీ వేరే హీరోయిన్ గురించి మాట్లాడితే నిజంగా ఆమె టాలెంటెడ్ అని మాట్లాడతారు. కానీ, బాధలో ఉన్నప్పుడు, ఆ బాధను పంచుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఇక్కడ, ఎవరినీ తప్పు పట్టడానికి లేదు. అందరూ బిజీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. అయినా, కూడా మనకోసం సమయం కేటాయిస్తున్నారంటే వారు మనకిచ్చే విలువ, చూపించే ప్రేమాభిమానాలు అంత గొప్పవి.
టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఈ మధ్య కాలంలో కాస్త స్లో అయింది. చేసినవి మంచి సినిమాలే అయినా కొందరు గ్లామర్ బ్యూటీస్ దెబ్బకి తట్టుకోలేదు. దాంతో, తాను కూడా స్కిన్ షో చేయడానికి రెడీ అయింది. అలా వచ్చిన సినిమాలు ఆమెకి మంచి గుర్తింపునే తీసుకువచ్చాయి. గత ఏడాది 'కిష్కిందపురి', 'పరదా' సినిమాలతో వచ్చింది. ఇక, ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన మాజీ లవర్ గురించి చెప్పి ఎమోషనల్ అయింది. అతని వల్ల ఎంతో మనోవేదనకి గురైనట్టు చెప్పి కన్నీటి పర్యంతం అయింది.
ఇలాంటి, సమయంలో తనకి ఇద్దరు హీరోలు అండగా ఉంటారని చెప్పిన అనుపమ..ఆ ఇద్దరు దుల్కర్ సల్మాన్, టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని అని ఓపెన్‌గా రివీల్ అయింది. తను కాస్త డల్‌గా ఉన్నా ఎలా తెలుస్తుందో గానీ, దుల్కర్ నుంచి మెసేజ్ వస్తుందని..అలా, బాధలో ఉన్నప్పుడు దుల్కర్ చాలా సపోర్ట్ చేస్తాడని చెప్పుకొచ్చింది. అలాగే, రామ్ కూడా నాకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్న ఆదుకుంటాడని తెలిపింది. వీరితో కలిసి అనుపమ జతగా సినిమాలు చేసింది. దుల్కర్ తో చేసిన 'ఐయామ్ గేమ్' సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కబోతోంది.


