సినిమా

Tollywood: ఆ హీరోయిన్స్ ముగ్గురు అడ్రస్ లేకుండా పోయారే?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Tollywood: కొందరు హీరోయిన్స్ కొత్తగా ఇండస్ట్రీకొచ్చే ముందు ఎన్నో కలలు కంటారు. కానీ, కొందరికి అవన్నీ కలలుగానే మిగిలిపోతాయి. కొందరు పక్క రాష్ట్రం నుంచి వచ్చి టాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకుంటారు. ఇలాంటి వారిలో కొందరు టాప్ హీరోయిన్ అయితే కొందరు మాత్రం మళ్ళీ సినిమా అవకాశం రాక అడ్రస్ లేకుండా పోతారు. ది రాజాసాబ్ సినిమాలో నటించిన ముగ్గురు హీరోయిన్స్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

నిధి అగర్వాల్:

హిందీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, తెలుగులో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పాపులర్ అయింది నిధి అగర్వాల్. కానీ, ఆ తర్వాత ఏ సినిమా చేసినా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడి నిధికి స్టార్ హీరోయిన్ ముద్రపడకుండా జరిగిపోయింది. ఇలాంటి, సమయంలో పవన్ కళ్యాణ్..ప్రభాస్ లాంటి ఇద్దరు అగ్ర హీరోలతో నటించే ఛాన్స్ అందుకుంది. కానీ, ఈ రెండు సినిమాలు నిధికి షాకిచ్చాయి. ముఖ్యంగా, ప్రభాస్ సరసన నటించిన ది రాజాసాబ్ అమ్మడి కెరీర్‌ని మలుపు తిప్పుతుందనుకుంటే ఆ మలుపు దగ్గరే ఆగిపోయింది.

మాళవిక మోహనన్:

తమిళంలో విజయ్ తలపతి నటించిన మాస్టర్ మూవీతో బాగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఈ బ్యూటీకి తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలగాలన్నదే కోరిక. అలాంటి, సమయంలో ప్రభాస్ సరసన ఓ హీరోయిన్‌గా ది రాజాసాబ్ మూవీలో అవకాశం అందుకుంది. దీనికోసం మూడేళ్ళు ఎదురుచూసింది. కానీ, ఈ మూవీలో ఆమె రోల్ అసలు ఎందుకుందో మారుతికి కూడా క్లారిటీ లేదు. దాంతో, తెలుగులో మళ్ళీ అవకాశమే రాలేదు.

రిద్ది కుమార్:

అంతకముందు ఏవో చిన్న చిన్న సినిమాలు చేసిన రిద్దికి, ఏకంగా ప్రభాస్ సరసన ఛాన్స్ అంటే కనీసం కలలో కూడా అది ఊహించి ఉండదు. దర్శకుడెవరనేది పక్కన పెడితే, హీరో మాత్రం ప్రభాస్. గట్టిగా నాలుగు సీన్లు, ఒక్క పాట చేస్తే చాలు మంచి గుర్తింపు వస్తుందని ఆశపడింది. కానీ, రిద్ది ఆశలన్నీ మారుతి ఎక్కడో కలిపేశాడు. ప్రభాస్ సరసన రాజాసాబ్ చేస్తే కెరీర్ ఎవరూ ఊహించని రేంజ్‌లో ఊపందుకుంటుందని సంబరపడిన ఈ ముగ్గురి కెరీర్ ఏంటో తెలియని పరిస్థితి.

#the rajasaab#prabhas#nidhi aggarwal#ridhi kumar#malavika moahan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి