తెలంగాణ

Telangana: 20:20 ఫైనల్‌కు శంఖారావమా?..

రచన: Venu•••5 నిమిషాల పఠనం

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గతంలో కొన్ని స్థానాల్లో మాత్రమే అనుకూల ఫలితాలు రావడంతో.. ఈసారి ఎన్నికలు సీఎంకు సవాలుగా మారే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు అభివృద్ధిని ప్రధాన అస్త్రంగా చేసుకుని సిటీ ఓటర్లను తనవైపు తిప్పుకునే వ్యూహంలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

- విదేశీ టూర్‌కు ముందు సీఎం ఇస్తున్న ఇండికేషన్ ఏంటి?

- 6 ప్రధాన జిల్లాల్లో ఎన్నికలకు సిద్ధమయ్యారా?

- అభివృద్ధి, అప్పులు, అనాదిగా వస్తున్న ఖర్చులే ఎజెండానా?

- సమ్మక్క సారక్క సెంటిమెంట్‌తో శంఖం పూరించారా?

- అసెంబ్లీ పెట్టిన తర్వాత కార్పొరేషన్ ఎన్నికలకు రెడీ అయ్యే ప్లాన్?

- ఒకే ఊపులో ఎమ్మెల్సీ, మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయా?

- మహిళలు, సన్న బియ్యం, హైదరాబాద్ అభివృద్ధే ప్రధాన ఎజెండానా?

- గత పాలకుల పాపాల లెక్కలతో 6 జిల్లాల ఓట్లు పడేలా ప్లాన్?

- ఇండిపెండెంట్ జెడ్పీటీసీ నుంచి సీఎం దాకా మైండ్ గేమ్‌తో ఎన్నికల సవాళ్లు విసిరిన రేవంత్‌

- రాబోయే రెండున్నరేళ్ల పాలనలో జరగబోయే 6 జిల్లాల ఎన్నికల మ్యాచ్‌పై స్వేచ్ఛ న్యూస్ స్పెషల్ స్టోరీ

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

స్వేచ్ఛ చైర్మన్

9848070809

ఎన్నో సవాళ్ల మధ్య రెండున్నరేళ్ల పాలనను పూర్తి చేసుకుంటున్న సీఎం తీరు చూస్తుంటే.. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారనే విషయం స్పష్టమవుతోంది. సొంత జిల్లాతో పాటు మరో ఐదు కీలక జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఆరు నెలల్లోపే జరగనున్న నేపథ్యంలో.. వాటిపై అధికార పార్టీ ఇప్పటి నుంచే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలంటే క్షేత్రస్థాయిలో లెక్కలు పక్కాగా ఉండాల్సిన అవసరం ఉంది.

ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గతంలో కొన్ని స్థానాల్లో మాత్రమే అనుకూల ఫలితాలు రావడంతో.. ఈసారి ఎన్నికలు సీఎంకు సవాలుగా మారే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు అభివృద్ధిని ప్రధాన అస్త్రంగా చేసుకుని సిటీ ఓటర్లను తనవైపు తిప్పుకునే వ్యూహంలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లపై కూడా అధికార పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిపక్షాలపై రాజకీయ పోరుకు వేదికగా మార్చేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్‌లో అభివృద్ధి పరుగులు

4 ఏండ్ల క్రితం వరంగల్ సమ్మక్క సారలమ్మను దర్శించుకుని ఎలాగైతే ఎన్నికల కోసం బయలుదేరారో, ఇప్పుడు మళ్లీ సీఎంగా మన్ననలను పొందానని చెప్పుకోవడానికి 6 జిల్లాల ఎన్నికలను రేవంత్ సీరియస్‌గా తీసుకున్నారు. అందుకే హైదరాబాద్‌లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. పాత బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని కూడా తన ఖాతాలో వేసుకుంటున్నారు.

సోమవారం అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రి సనత్ నగర్ టిమ్స్ ఓపెనింగ్ కూడా విదేశాలకు వెళ్లే ముందు ప్లాన్ చేసుకున్నారు. పెట్టుబడులను తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో పాటు సెప్టెంబర్‌లో వానాకాల అసెంబ్లీ సమావేశాలు పెట్టి రైతులకు చేసిన మేలు, నగర ప్రజలకు అవినీతి లేకుండా అభివృద్ధి పేరుతో అందించిన లెక్కలు వివరించనున్నారు.

#Telangana#political#Election#Vote#Verdict#Final
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి