Irumudi: కొన్ని సినిమాలు మ్యూజిక్ వల్ల బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్‌గా నిలిచాయి. కథ-కథనాలు కాస్త అటు ఇటుగా ఉన్నా సిచ్యువేషనల్ సాంగ్స్ సినిమా సక్సెస్‌కి ప్రధాన కారణం అయినవి ఎన్నో ఉన్నాయి. పెళ్లి సందడి, దేవదాస్, ఆర్య లాంటి సినిమాలు ముందు మ్యూజికల్‌గా పెద్ద హిట్ అని చెప్పక తప్పదు. అన్నమయ్య లాంటి డివోషనల్ సినిమాలు కూడా ఆహ్లాదకరమైన సంగీతంతో మైల్ స్టోన్ మూవీస్‌గా నిలిచాయి.
మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ అండ్ డివోషనల్ మూవీ 'ఇరుముడి'. శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. 'నిన్నుకోరి', 'మజిలీ', 'ఖుషి' లాంటి సినిమాలతో వచ్చిన శివ నిర్వాణ, ఈసారి రవితేజతో డిఫరెంట్ జానర్ సినిమా అని చెప్పలేము గానీ, ఆయనకి మాత్రం ఇది కాస్త వెరైటీ మూవీనే అని చెప్పాలి. 'ఇరుముడి' రవితేజ కెరీర్‌లో నిజంగా కొత్త అధ్యాయాన్ని రాస్తుందని చెప్పొచ్చు.
ఇప్పటి వరకూ 'ఇరుముడి' సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ సహా ఇతర ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేయగా, తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న 'మల్లెపూల పల్లకి' లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఇలా సాంగ్ రిలీజైందో లేదో అలా యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, ఒరిజినల్ సాంగ్ పాడిన డప్పు శ్రీనుతో ఈ పాట పాడించడం బాగా ప్లస్ అయింది.
'మల్లెపూల పల్లకి' సాంగ్‌లో డాన్స్ కొరియోగ్రఫీ కూడా చాలా చక్కగా ఉంది. ఈ సాంగ్‌కి విజె శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు. ఖచ్చితంగా ఈ పాటతో థియేటర్స్ దేవాలయాలు అవడం గ్యారెంటీ అని అర్థమవుతోంది. ఆగస్టు 21న 'ఇరుముడి' భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక, ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియ భవానీ శంకర్ నటించింది. బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.


