తెలంగాణ

GRMB : గోదావరి జలాల వివాదంపై హై టెన్షన్.. జీఆర్ఎంబీ సమావేశం వాయిదా

రచన: Kumar••4 నిమిషాల పఠనం

తెలుగు రాష్ట్రాల నడుమ మరోసారి జలవివాదం ముదిరిన విషయం తెలిసిందే. కృష్ణా, గోదావరి నదీ జలాల వాడకంలో తమకు అన్యాయం జరుగుతోందని ఓ వైపు తెలంగాణ ఆరోపిస్తుంటే..లేదు లేదు తమకే అన్యాయం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది.

తెలుగు రాష్ట్రాల నడుమ మరోసారి జలవివాదం ముదిరిన విషయం తెలిసిందే. కృష్ణా, గోదావరి నదీ జలాల వాడకంలో తమకు అన్యాయం జరుగుతోందని ఓ వైపు తెలంగాణ ఆరోపిస్తుంటే..లేదు లేదు తమకే అన్యాయం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. ఎగువన తెలంగాణ ఇష్టానుసారంగా ప్రాజెక్టులు కడుతూ తమకు న్యాయంగా రావాల్సిన వాటాను వాడుకోకుండా చేస్తున్నదని ఏపీ వాదిస్తుంటే.. కృష్ణా జలాల్లో దక్షిణ తెలంగాణకు నష్టం వాటిల్లే విధంగా ఏపీ వ్యవహరిస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తున్నది.

దీంతో జలవివాదాల పరిష్కారానికి మరోసారి జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ బోర్డులు సమావేశం కానున్నాయి. ఈ రెండు బోర్డుల సమావేశాలకు తెలంగాణ, ఏపీకి చెందిన నీటిపారుదలశాఖ మంత్రులు, అధికారులు హాజరవుతారని తెలుస్తోంది. ఇందులో రాష్ట్ర విభజన సమయంలో నిర్ణయించిన మేరకు ఎవరికి ఎన్ని టీఎంసీలు రావాలి? ఎలా వాడుకోవాలి? కొత్త ప్రాజెక్టులకు ఇరు రాష్ట్రాల అభ్యంతరాలను స్వీకరించి బోర్డు సమావేశంలో ఒక పరిష్కారం కనుగొననున్నారు.

అయితే, జీఆర్ఎంసీ సమావేశంలో ఈసారి లేవెనత్తాల్సిన అంశాలపై ఇప్పటికే ఏపీ సర్కార్ ఏజెండా నిర్ణయించిందని.. దానిపై తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు ఇంతవరకు అభ్యంతరం తెలపలేదని మాజీ ఇరిగేషన్ మినిస్టర్,శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ హరీశ్ రావు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై అధికార,ప్రతిపక్ష గులాబీ పార్టీ నడుమ మాటల యుద్ధం జరుగుతోంది. అటు గోదావరి, ఇటు కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్న సీఎం రేవంత్ .. తన గురువు చంద్రబాబు కోసం చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల మధ్య ఎల్లుండి జరగాల్సిన గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) సమావేశం వాయిదా పడినట్టు తెలిసింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున జీఆర్ఎంబీ బోర్డు సమావేశం వాయిదా వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. తదుపరి తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్టు గోదావరి రివర్ బోర్డు తెలిపింది. మరోవైపు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ భేటీ రేపు యథాతథంగా జరగనుంది. దీనికి ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. కృష్ణా నీటి పంపకాలు, ఇతర ప్రాజెక్టుల అంశాలపై ఈ భేటీలో ప్రత్యేకంగా చర్చించనున్నారు.

#GRMB meet#postpone#telangana#andrapradesh#KRMB
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి