సినిమా

Vijay DevarakonDa: విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో 'రౌడీ జనార్ధన'

రచన: Anshu•••4 నిమిషాల పఠనం

Vijay DevarakonDa:ఈ మధ్య మన సౌత్ సినిమా ఇండస్ట్రీలలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమాలకి మంచి ఆదరణ లభిస్తోంది. ఇటీవల వచ్చిన తమిళ సినిమా డీసీ. దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన మొదటి సినిమా. వామిక గబ్బీ హీరోయిన్‌గా నటించింది. సాధారణంగా తమిళ సినిమాలు చాలా వరకూ రియలిస్టిక్ కథ-కథనాలతో రూపొందుతుంటాయి. అలాంటి, సినిమాలు మంచి కమర్షియల్ హిట్‌గా కూడా నిలిచాయి.

తెలుగులో, కూడా ఈ మధ్య కాలంలో వచ్చిన విలేజ్ బ్యాగ్ డ్రాప్ సినిమాలకి ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అవుతున్నారు. ఉదాహరణకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సినిమా. ఇందులో, చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటించి అవార్డ్ రేంజ్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఒక ఊరు కోసం నేషనల్ లో క్రీడా పోటీల్లో పాల్గొని ఆ ఊరుకు ఓ గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలో చరణ్ నటన అమోఘం.

చాలావరకూ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలు విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్నవే. అలాంటి సినిమానే విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 'రౌడీ జనార్ధన'. ఇందులో, హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటిస్తోంది. రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు.

తాజాగా, ఈ సినిమాకి సంబందించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'రౌడీ జనార్ధన' సినిమాకి విలేజ్ బ్యాక్ డ్రాప్ ప్రధానమైన బలం అని, భారీ యాక్షన్ సీన్స్, విజయ్ పర్ఫార్మెన్స్ హైలెట్‌గా నిలుస్తాయని చెప్తున్నారు. ఇప్పటి వరకూ విజయ్ ఇలాంటి సినిమా గానీ, పాత్ర గానీ చేయలేదు. ఇటీవల కాలంలో హిట్ దక్కడం లేదు. అందుకే, ఈ సారి గ్యారెంటీ హిట్ కొట్టే సినిమాతో రాబోతున్నాడని తెలుస్తోంది.

#vijaydevarakonda#ravikirankola#dilraju#rowdy janardhana#keerthysuresh
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి