National

TG : సీజేఐ సీరియస్.. నల్సార్ విద్యార్థులకు బీసీఐ చైర్మన్ క్షమాపణలు

రచన: Kumar••4 నిమిషాల పఠనం

హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా విద్యార్థులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా క్షమాపణలు చెప్పారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో బీసీఐ చైర్మన్ ఈ మేరకు నల్సార్ స్టూడెంట్స్‌కు క్షమాపణలు చెప్పినట్టు సమాచారం.

హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా విద్యార్థులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా క్షమాపణలు చెప్పారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో బీసీఐ చైర్మన్ ఈ మేరకు నల్సార్ స్టూడెంట్స్‌కు క్షమాపణలు చెప్పినట్టు సమాచారం. ‘నా మాటలు బాధించి ఉంటే క్షమాపణలు కోరుతున్నా’ అని ఓ లేఖ విడుదల చేశారు.

ఇదిలాఉండగా, సుప్రీంకోర్టు సీజేఐ సూర్యకాంత్‌‌ను చీఫ్ గెస్టుగా పిలువొద్దని, ఆయన చేతుల మీదగా డిగ్రీ పట్టాలు అందుకోబోమని నల్సార్ లా వర్సిటీ విద్యార్థులు ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో సీజేఐకు వ్యతిరేకంగా కొందరు విద్యార్థులు క్యాంపెయిన్ చేశారని..2026 బ్యాచ్ విద్యార్థుల నమోదుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిషేధం విధించింది.

ఆ తర్వాత కొందరు చేసిన తప్పుకు అందరినీ శిక్షించడం సరికాదని భావించి, కొన్ని గంటల్లోనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇదే సమయంలో.. సీజేఐకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేసిన విద్యార్థులు, అధ్యాపకుల జాబితాతో ఓ రిపోర్ట్ ఇవ్వాలని వర్సిటీ యాజమాన్యాన్నిబీసీఐ కోరింది. బీసీఐ తీరు పట్ల సీజేఐ సూర్యకాంత్‌తో పాటు యూనివర్సిటీ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది.

తమ విద్యార్థులపై విచారణ చేయాలా? వద్దా? అనేది తమ పరిధిలో అంశమని నల్సార్ వర్సిటీ బీసీఐకు కౌంటర్ ఇచ్చింది.బీసీఐ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా క్షమాపణలు చెప్పాలంటూ ఘాటుగా స్పందించిన విద్యార్థుల సంఘం కూడా ఓ ప్రకటన విడుదల చేసింది.విద్యార్థులకు, తనకు మధ్య నడుస్తున్న వివాదంలో మీ జోక్యం ఏంటి? అంటూ జస్టిస్ సూర్యకాంత్ సైతం బీసీఐ మీద సీరియస్ అయ్యారు.

దీంతో NALSAR విద్యార్థులకు క్షమాపణ చెప్తూ BCI చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా ఓ లేఖ రాశారు. తన మాటలు గానీ, లేఖ గానీ విద్యార్థుల మనోభావాల్ని దెబ్బతీసి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని ఆయన విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. ఇది కేవలం మన విద్యార్థుల భావాలు, ఆందోళనలకు విలువ ఉందని అంగీకరించడమేని లేఖలో వెల్లడించారు.

https://x.com/pulsenewsbreak/status/2088664282997362919?s=20

#NALSAR#BCI chairman mishra#apology#letter#CJI justice suryakanth
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి