క్రైమ్

TG : నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ టూర్‌లో తీవ్ర విషాదం

రచన: Kumar••3 నిమిషాల పఠనం

రాష్ట్రంలో మరో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలో టూరిజం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్‌లో బోటింగ్ సదుపాయం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిని టూరిజం శాఖ పెద్దఎత్తున ప్రమోట్ చేస్తున్నది.

రాష్ట్రంలో మరో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలో టూరిజం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్‌లో బోటింగ్ సదుపాయం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిని టూరిజం శాఖ పెద్దఎత్తున ప్రమోట్ చేస్తున్నది. చాలా కాలంగా ఇక్కడకు టూరిస్టులు వచ్చి సందడి చేస్తుంటారు. వాటర్‌లో ట్రావెల్ చేయడానికి చిన్న చిన్న బోట్లను సైతం ఏర్పాటు చేశారు.

అయితే,ఈ క్రమంలో సాగర్ బ్యాక్ వాటర్‌లో విహారం కోసం వచ్చిన ఓ పర్యాటకుడు గల్లంతైనట్టు సమాచారం.నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్‌లో టూరిజంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. వైజాగ్ కాలనీలోని నాగార్జున సాగర్ బ్యాక్‌ వాటర్‌లో విహారం కోసం ఓ మిత్రబృందం వెళ్లింది.

ఈ క్రమంలోనే అందులో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో ఓ యువకుడు మునిగిపోయాడు. సదరు యువకుడి ఆచూకీ కోసం దాదాపు రెండు గంటల పాటు రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. చివరకు యువకుడి బాడీని గుర్తించాయి. మరణించిన వ్యక్తిని దుర్గం తిరుమలేష్‌గా గుర్తించారు. మృతుడు కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. తోటి మిత్రుల సమాచారం ఆధారంగా పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమాదం సంభవించడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

https://x.com/pulsenewsbreak/status/2088820227299856612?s=20

అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్టు పోలీసులు వెల్లడించారు. కాగా, సరదా విహారయాత్ర కాస్త విషాదంగా ముగియడంతో అక్కడకు వచ్చిన తోటి పర్యాటకులు సైతం భయాందోళనకు గురైనట్టు తెలుస్తోంది.

#Nagarjuna sagar back water#swimming#drowned#death#nalgonda
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి