ఆర్డర్ డెలివరీ ఆలస్యం జరిగిందని కొందరు వినియోగదారులు అసహనం వ్యక్తం చేయడంతో పాటు సహనం కోల్పోతున్నారు. డెలివరీ బాయ్స్ మీద దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ ఆర్డర్ డెలివరీ ఆలస్యం అయ్యిందని ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. బాయ్‌ను ఇంట్లో బంధించి టార్చర్ చేశాడు. ఈ ఘటన యూపీలో మీరట్‌లో చోటుచేసుకోగా.. తోటి గిగ్ వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు రోడ్డెక్కారు. దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేయడంతో పాటు క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
వివరాల్లోకివెళితే.. నిన్న రాత్రి 9 గంటల సమయంలో.. యమన్(34) అనే వ్యక్తి అండర్‌వేర్, చిప్స్ ప్యాకెట్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాడు. స్టోర్ వాళ్లు అండర్‌వేర్ తీసుకురావడంలో ఆలస్యం చేయడంతో.. డెలివరీ బాయ్ అమిత్ 5 నిమిషాలు ఆలస్యంగా ఆర్డర్ డెలివర్ చేశాడు.
దాంతో 5 నిమిషాలు ఆలస్యం ఎందుకు అయ్యిందంటూ అమిత్‌పై యమన్ చెయ్యి చేసుకున్నాడు. ఆపై అతడ్ని ఇంట్లోకి తీసుకెళ్లి.. కొద్దిసేపు బంధించి.. దుర్భాషలాడుతూ దాడి చేశాడని బాధితుడు పేర్కొన్నాడు.సీసీటీవీ ఫుటేజ్ వైరల్ కావడంతో అమిత్‌కి మద్దతుగా తోటి డెలివరీ ఏజెంట్లు రంగంలోకి దిగారు. పోలీసులు కేసు నమోదు చేశారు కానీ.. యమన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ తీవ్ర మండిపడుతున్నారు. యమన్‌ను మీడియా ముందుకు తీసుకొచ్చి క్షమాపణ చెప్పించాలని, అప్పటిదాకా డ్యూటీ ఎక్కబోమని డిమాండ్ చేస్తున్నారు.
యమన్ ఇప్పుడు పరారీలో ఉన్నాడని.. సెర్చ్ ఆపరేషన్ పేరిట పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. యమన్‌ను అరెస్ట్ చేసేదాకా తాము సమ్మె విరమించేది లేదని బ్లింకిట్ డెలివరీ ఏజెంట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. బాధిత డెలివరీ బాయ్‌కు మద్దతుగా పలువురు కామెంట్స్ చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
https://x.com/pulsenewsbreak/status/2088858537632092594?s=20


