జాతిరత్నాలు మూవీ ఫేమ్ ‘ఫరియా అబ్దుల్లా’ తనపై జరుగుతున్న ట్రోలింగ్‌కు సంబంధించి ఏడుస్తూ నెట్టింట్ ఓ వీడియోను షేర్ చేశారు. ఇటీవల ఆమె తెలంగాణ పండుగ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలలో భాగమైన బోనాల వేడుకల్లో పాల్గొనడంతో పాటు అమ్మవారి బోనం ఎత్తారు.ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
అయితే, ఫరియా బోనాల వేడుకల్లో పాల్గొనడంపై కొందరు సోషల్ మీడియా వేదికగా మతం పేరిట వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. తెలంగాణ సంస్కృతిని గౌరవిస్తూ ఉత్సవాల్లో పాల్గొంటే దానికి మతరంగు పులిమి ద్వేషాన్ని వ్యాప్తి చేయడంపై ఆమె ఆవేదనకు లోనయ్యారు.‘నేను ఒక కన్వర్టెడ్ ముస్లిం.. ప్రకృతిలోనే దైవాన్ని ఆరాధిస్తాను. నాకు అన్ని మతాలు సమానమే. చెట్టు, రాయి, సీతాకోకచిలుక ఇలా అన్నింటిని గౌరవిస్తాను. నా ఆలోచనను అర్థం చేసుకోకపోతే అది మీ ఇష్టం’ అంటూ వీడియో సందేశంలో పేర్కొంటూ భావోద్వేగానికి గురయ్యారు.
అయితే, ఫరియా పట్ల జరుగుతున్న ట్రోలింగ్‌ను ఖండిస్తూ మత సామరస్యానికి, సంస్కృతి పట్ల ఆమె చూపిన గౌరవానికి పలువురు అభిమానులు,నెటిజన్లు మద్దతుగా నిలిచారు. కాగా, గతవారం హైదరాబాద్‌లోని మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో జరిగిన బోనాల వేడుకల్లో ఫరియా అబ్దుల్లా పాల్గొన్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో అమ్మవారికి బోనం సమర్పించి, పోతురాజుల విన్యాసాల మధ్య ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. తెలంగాణ సంస్కృతిని, అక్కడి ప్రజల ఆప్యాయతను ఆమె ప్రశంసించిన నేపథ్యంలోనే ఆమె దారుణంగా ట్రోలింగ్‌కు గురయ్యారు.
తాజాగా ఫరియాను ట్రోల్ చేస్తుండటంపై తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు స్పందించారు. ఆమెపై వస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. ‘భారతదేశం లౌకిక దేశం. ఇక్కడ ఎవరైనా ఎక్కడికైనా వెళ్లొచ్చు.ఫరియా అబ్దుల్లాను నిర్వాహకులు ఆహ్వానిస్తేనే హాజరయ్యారు. ఆమెపై అసభ్యకరమైన విమర్శలు చేయడం కరెక్ట్ కాదు.ఇందులో తప్పు పట్టడానికి ఏమీ లేదు’ అని ఆయన పేర్కొన్నారు.
https://x.com/RTVnewsnetwork/status/2088790470206054485?s=20


