సినిమా

Anil Ravipudi: ఆ నలుగురికీ ఆదివారాలు, సెలవులు లేవు!

రచన: Anshu•••4 నిమిషాల పఠనం

Anil Ravipudi: అనిల్ రావిపూడి..ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ మన టాలీవుడ్‌లో. ఏ దరకుడైనా రెండు హిట్లు పడితే ఆ తర్వాత ఫ్లాప్ పడిన సినిమాలు చాలానే ఉన్నాయి. వరుసగా సక్సెస్ రికార్డ్‌ను మేయిన్‌టైన్ చేయడం అంత ఈజీ కాదు. కానీ, టాలీవుడ్‌లో ఎస్.ఎస్.రాజమౌళి, అనిల్ రావిపూడి ఇప్పటి వరకూ ఒక్క ఫ్లాప్ కూడా చూడలేదు. అనిల్ రావిపూడి నుంచి మన శంకరవరప్రసాద్‌గారు సినిమాతో కలిపి 9 సినిమాలొచ్చాయి.

ఈ 9 సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పుడు, మరోసారి మల్టీస్టార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా ఈ మల్టీస్టారర్ తెరకెక్కుతోంది. ఇందులో, వెంకీ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ సరసన కృతీ శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, సంక్రాంతి పండుగను టార్గెట్‌గా పెట్టుకొని అనిల్ రావిపూడి ఈ నలుగురికి అసలు సెలవులే ఇవ్వడం లేదట.

ఆదివారాలు, హాలీడేస్ లాంటివేమీ లేకుండా నాన్ స్టాప్‌గా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేశాడట అనిల్ రావిపూడి. ఇప్పటి వరకూ పూర్తైన రష్ చాలా బావుందని, నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు. వెంకీఅనిల్ కాంబోలో వస్తోన్న 5 వ సినిమా కాగా, కళ్యాణ్ రామ్, అనిల్ కాంబోలో వస్తోన్న 2వ సినిమా కావడం విశేషం. అనిల్ రావిపూడి సంక్రాంతి పండుగకి వచ్చి సాలీడ్ హిట్ కొడుతున్నాడు.

2027, సంక్రాంతికి కూడా ఇదే సెంటిమెంట్‌ని కొనసాగించాలని, భారీ హిట్ కొట్టాలని ఒకవైపు షూటింగ్ ఇంకోవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ని కంప్లీట్ చేస్తున్నాడట. ఇటీవలే వెంకటేష్ పోషిస్తున్న పాత్రను రివీల్ చేశాడు. అంతకముందు కళ్యాణ్ రామ్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ రెండు లుక్స్‌తోనే అనిల్ రావిపూడి సినిమాపై అంచనాలను పెంచేశాడు. ఇక, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్‌తో చేసిన ఇంట్రో వీడియోతో మ్యూజికల్‌గా కూడా హిట్ అని హింట్ ఇచ్చాడు. ఈ రకంగా అనిల్ రావిపూడి టీమ్ కి రెస్ట్ ఇవ్వకుండా సినిమాను పూరి చేస్తున్నాడట.

#AnilRavipudi#Venkatesh#NadamuriKalyanRam#KeerthySuresh#KrithiSetty
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి