తెలంగాణ

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ - ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో తాజాగా అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రాబోయే 24గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది.

ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో లేదా చెట్ల కింద నిలబడవద్దని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తీరప్రాంతం వెంబడి సముద్రం అలజడిగా మారే అవకాశం ఉండటంతో, ముందు జాగ్రత్త చర్యగా మంగళవారం వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

తెలంగాణ విషయానికి వస్తే, పలు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, జనగామ, వరణ్గల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వాతావరణ శాఖ 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. ఈ జిల్లాల్లో గాలి వేగం పెరిగి మోస్తరు వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి.

వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు, గ్రామీణ ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. వర్షం కురిసే సమయంలో విద్యుత్ స్తంభాలు, పాత భవనాలకు దూరంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని విపత్తు నిర్వహణ బృందాలు సూచించాయి.

 https://x.com/APSDMA/status/2088832187558965570?s=20

#AP Weather Update#Telangana Rains#Bay of Bengal Low Pressure#APSDMA Warning#Yellow Alert Telangana#Rain Forecast 2026#Thunderstorms AP TG#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి