వైరల్ న్యూస్

Birthday Twist: ఊరుకో అక్కా.. ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా ఏంటి?

రచన: Mamatha puppala••3 నిమిషాల పఠనం

పుట్టినరోజున భర్త ఇచ్చే బహుమతి కోసం ఏ భార్య అయినా చాలా ఆశగా ఎదురుచూస్తుంది. అందులోనూ ఆ బహుమతి కాస్త పెద్ద సైజులో ఉంటే ఆ ఆనందమే వేరు..! సరిగ్గా అలాంటి ఒక సంఘటనే ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఓ భార్య తన పుట్టినరోజు సందర్భంగా భర్త నుంచి ఖరీదైన కారు గిఫ్ట్‌గా వస్తుందని కొండంత ఆశ పెట్టుకుంది. తీరా బహుమతి చూశాక ఆమె మైండ్ బ్లాంక్ అయిపోయింది.

భార్య బర్త్‌డే రోజు రానే వచ్చింది.. ఇంటి ముందు కారు ఆకారంలో, నీట్‌గా ప్యాక్ చేసి ఉన్న ఒక పెద్ద గిఫ్ట్ ప్రత్యక్షమైంది. దాన్ని చూడగానే ఆ భార్య సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. తనకు నిజంగానే కారు కొనిచ్చాడని, భర్త ప్రేమను చూసి ఎంతో మురిసిపోయింది. "అబ్బా.. ఎంత మంచి భర్త!" అనుకుంటూ, ఎంతో ఆత్రుతగా ఆ గిఫ్ట్ కవర్‌ను తొలగించడం ప్రారంభించింది.

అయితే, ఆ కవర్ తొలగించగానే అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అందులో ఉంది కారు కాదు సరికదా.. కనీసం బైక్ కూడా లేదు. కారు ఆకారంలో ప్యాక్ చేసి పెట్టింది ఒక ‘బెడ్‌రూమ్ సెట్’. అవును, ఒక మంచం. దానికి సంబంధించిన అల్మారాలను కారు షేప్‌లో అమర్చి, గిఫ్ట్ పేపర్‌తో కవర్ చేసి భర్తగారు సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు.

ఈ ఊహించని ట్విస్ట్‌తో ఆమె ముఖంలో ఆనందం క్షణాల్లో మాయమై నిరాశ ఆవహించింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆమె ముఖకవళికలను చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ‘ఊరుకో అక్కా.. ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి..’ అంటూ సరదాగా స్పందిస్తున్నారు. మొత్తానికి ఈ ‘కారు’ గిఫ్ట్ కామెడీ వీడియో అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.

https://www.instagram.com/reel/DcE8IGaTL91/?utm_source=ig_web_button_share_sheet

#Viral Video#Birthday Gift Surprise#Husband Wife Comedy#Car Gift Prank#Social Media Viral#Funny Video#Birthday Surprise Twist#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి