సినిమా

NTR-NEEL: హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో "డ్రాగన్" ఎంట్రీ..

రచన: Anshu4 నిమిషాల పఠనం

NTR-NEEL: మాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్‌టిర్ తాజాగా డ్రాగన్ మూవీ సెట్స్‌లో ఎంటరైనట్టు తెలుస్తోంది. ఇటీవల, ఆయన ఈ సినిమా షూటింగ్ సమయంలోనే భుజానికి గాయమై సర్జరీ చేయించుకున్నారు. డాక్టర్ల సూచనల మేరకు ఇన్నిరోజులు రెస్ట్ తీసుకున్న తారక్..తిరిగి సెట్స్ లో జాయిన్ అయ్యాడట. ఇప్పటికే, షూటింగ్ ఆలస్యం కావడంతో ఇక, ఆలస్యం చేయకూడనే డ్రాగన్ కి మళ్ళీ డేట్స్ ఇచ్చాడని తెలుస్తోంది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అత్యంత భారీ యాక్షన్ సినిమాగా రూపొందుతోంది. ఆయన మార్క్ డార్క్ థీమ్ మాత్రమే కాకుండా, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ మొత్తం కలర్ ఫుల్‌గానూ ఉండబోతుందట. ఈ సినిమాలో ఎన్‌టిర్ సరసన రుక్మిణి వసంత్ నటిస్తోంది. ఇప్పటికే, అఫీషియల్‌గా బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ నటించేది కన్‌ఫర్మ్ అవగా, ఈ మధ్య ఆలియా భట్, షాహిద్ కపూర్ గెస్ట్ రోల్స్ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి.

వాస్తవానికి, డ్రాగన్ సినిమా షూటింగ్ ఇంకా సగానికి పైగానే చెయ్యాల్సి ఉందట. ఎన్‌టిర్ కి గాయం అయిన నేపథ్యంలో దాదాపు 2 నెలలకి పైగానే చిత్రీకరణ నిలిచిపోయింది. ఇంకా, ఆలస్యం అయితే ఓటీటీ సంస్థల నుంచి ఒత్తిడి, బిజినెస్ పరంగా డిఫరెన్సెస్ వచ్చేస్తాయని తారక్..పూర్తి స్థాయిలో కోలుకోకపోయినా ప్రశాంత్ నీల్‌తో షూట్ స్టార్ట్ చేద్దామని చెప్పాడట. అందుకు, తగ్గట్టుగానే ఆయన హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్‌లో మళ్ళీ డ్రాగన్ షూట్ మొదలుపెట్టినట్టు సమాచారం.

ఇక, ఈ సినిమాను ఎన్‌టిర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మైత్రీ వారు నిర్మిస్తున్న సినిమాలపై అంచనాలు బాగా ఏర్పడుతున్నాయి. దీనికి, కారణం ఈ సంస్థలో నిర్మిస్తున్న సినిమాలు భారీ విజయాలను అందుకోవడమే. అందుకే, ఎన్‌టిర్-నీల్ సినిమాపై కూడా అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకూ తారక్ ఖాతాలో సాలీడ్ హిట్ చేరలేదు. దేవర హిట్ అన్న మాటే గానీ, అది ఎన్‌టిర్ స్టామినాకి సరిపోయోంత మాత్రం కాదు. అందుకే, ఈ సినిమాపై అందరి చూపు ఉంది.

#NTR#Prashanth Neel#Dragon#Rukmini Vasanth#Anil Kapoor
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి