Vaishnavi Chaitanya: తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ సినిమా ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్. ఈ సినిమాకి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించాడు. సూపర్ హిట్ వెబ్ సిరీస్ 90స్ కి సీక్వెల్‌గా ఇప్పుడు ఫ్యూచర్ ఫిల్మ్ రూపొందింది. సెప్టెంబర్ 11న థియేటర్స్‌లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హీరోయిన్ వైష్ణవి చైతన్య..లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో కపుల్ ఉంటారని..కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన సినిమా అని రివీల్ చేసింది.
"లివ్ ఇన్ రిలేషన్ షిప్" అంటే ఇలాంటి కాన్‌సెప్ట్స్ ఎక్కువగా బాలీవుడ్‌లో రూపొందుతుంటాయి. మన తెలుగు నేటివిటీకి అంతగా సెట్ అయ్యే కథాంశాలు కావు. కానీ, ఇప్పుడు అందరూ అప్‌డేట్ అయ్యారు. వెబ్ సిరీస్‌లో ఉన్న విపరీతమైన అడల్ట్ కంటెంట్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య నటించిన బేబి సినిమాలోనూ కొన్ని ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. పబ్ కల్చర్..బెడ్రూం సీన్స్ ఉన్నా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఆదరించారు.
కాబట్టి, ఎపిక్ మూవీలో కూడా ఘాటైన రొమాంటిక్ సీన్స్ ఉన్నా కూడా ప్రతీ ఒక్కరూ చూసేలా ఉంటాయని..స్పష్టం చేసింది వైష్ణవి. యూకే లో చదువు కోసం వెళ్ళే హీరోహీరోయిన్ అక్కడ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటారని..కథకి అవసరమైన సన్నివేశాలను దర్శకుడు ఆదిత హాసన్ చాలా బాగా తెరకెక్కించాడని వెల్లడించింది. అయితే, 90స్ అంత క్లీన్‌గా ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్ ఉండకపోవచ్చు అంటూ యూత్ ఆడియన్స్ కి హింట్ ఇచ్చింది.
ఇక, కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలను చేసి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి..ఇప్పుడు హీరోయిన్‌గా క్రేజీ ప్రాజెక్ట్స్ చేతిలో పెట్టుకుంది. ప్రస్తుతం, సితార సంస్థలో నితిన్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ యంగ్ బ్యూటీ..రెండు తమిళ సినిమాలు..ఓ హిందీ సినిమాతో బిజీగా ఉన్నట్టు వెల్లడించింది. మొత్తానికి, ఇటు సౌత్..అటు నార్త్ ఇండస్ట్రీలో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ఒప్పుకుంటూ దూసుకెళుతోంది. బేబీ తర్వాత మళ్ళీ సాలీడ్ హిట్ దక్కలేదు. ఎపిక్ మూవీతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.








