తెలంగాణ

Suspension: తాతా మధు, నవీన్‌పై సస్పెన్షన్ వేటు

రచన: NK4 నిమిషాల పఠనం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలపై మండలిలో సస్పెన్షన్ వేటు పడింది. వారిద్దని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సస్పెండ్ చేశారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిని సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్ బాబు మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు.

Suspension: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలపై మండలిలో సస్పెన్షన్ వేటు పడింది. వారిద్దని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సస్పెండ్ చేశారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిని సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్ బాబు మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై మండలి చైర్మన్ మూజువాణి పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. అనంతరం సెషన్ మొత్తానికి ఇద్దరు ఎమ్మెల్సీలను సస్పెండ్ చేసినట్లు మండలి ఛైర్మన్ ప్రకటించారు. ఆ ఇద్దరి సస్పెన్షన్ తర్వాత మండలిని వాయిదా వేశారు.

శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు మహేశ్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దళిత, గిరిజన, మహిళా వ్యతిరేకి అయిన బీఆర్ఎస్ ను జనం ఎందుకు ఆదరిస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఉండేందుకు వీల్లేదన్నారు. టాటా మధు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం కాదని.. కేసీఆర్ మనసులో ఏముందో టాటా మధు నోటి నుంచి బయటకు వచ్చిందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

స్పీకర్ ని ఉద్దేశించి ఎమ్మెల్సీలు మాట్లాడిన భాష ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆలోచన విధానమే అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఇదంతా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కుట్ర అని, మరోసారి రాష్ట్రాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికే బీఆర్ఎస్ ఈ ప్రయత్నం చేసిందని ఆయన ఆరోపించారు. పైనుంచి ఆదేశాలతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు స్పీకర్ పై అలాంటి వ్యాఖ్యలు చేశారని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆత్మగౌరవం పోరాటం నుంచి పుట్టిందే ఈ శాసనసభ అన్న భట్టి విక్రమార్క.. ఆత్మగౌరవంపై దాడి జరిగితే మరిన్ని పోరాటాలు జరుగుతాయని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెబుతారని అనుకుంటే మళ్లీ అవమానపరిచేలా మాట్లాడారని ధ్వజమెత్తారు. అధికారాన్ని మళ్లీ పొందాలనే తపనతోనే బీఆర్ఎస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు బాధ్యతగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ హితవు పలికారు.

#Suspension#Brs#Mlc#Telangana Politics#Swechaa News#Tata Madhu#Naveen Kumar Reddy
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి