తెలంగాణ

కేసీఆర్ ఎందుకు చనిపోవాలి? కాంగ్రెస్‌ను ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉంది- కేటీఆర్

రచన: NK7 నిమిషాల పఠనం

సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ స్పీకర్ కులాన్ని అడ్డం పెట్టుకుని సీఎం రేవంత్ నీచమైన రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్ పై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తమ పార్టీ ఎమ్మెల్సీ తాతా మధు చెప్పారని కేటీఆర్ తెలిపారు. అయినప్పటికి కేసీఆర్ ఆదేశాలతో తన వ్యాఖ్యలపై తాతా మధు విచారం వ్యక్తం చేశారని చెప్పారు. హైదరాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

KTR: సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ స్పీకర్ కులాన్ని అడ్డం పెట్టుకుని సీఎం రేవంత్ నీచమైన రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్ పై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తమ పార్టీ ఎమ్మెల్సీ తాతా మధు చెప్పారని కేటీఆర్ తెలిపారు. అయినప్పటికి కేసీఆర్ ఆదేశాలతో తన వ్యాఖ్యలపై తాతా మధు విచారం వ్యక్తం చేశారని చెప్పారు. హైదరాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ చనిపోవాలా?

కాంగ్రెస్ గూండాలను కేసీఆర్ ఇంటిపైకి పంపించారని ముఖ్యమంత్రి రేవంత్ పై మండిపడ్డారు కేటీఆర్. కాంగ్రెస్ ను ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. కేసీఆర్ చనిపోవాలని ఇద్దరు కాంగ్రెస్ శాసనసభ్యులు అంటున్నారు.. తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ చనిపోవాలా? అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినందుకు కేసీఆర్ చనిపోవాలా? అని కేటీఆర్ ధ్వజమెత్తారు.

ముందు చావు వచ్చేది కాంగ్రెస్ కే

కేసీఆర్ చనిపోవాలి అంటూ మాట్లాడటం తెలంగాణ గుండెను గాయపరిచిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మనసులోని మాటను వారు బయటపెట్టారని విరుచుకుపడ్డారు. హిట్లర్ కు పట్టిన గతే సీఎం రేవంత్ కు పడుతుందన్నారు కేటీఆర్. తప్పకుండా అందరికీ చావు వస్తుందన్న కేటీఆర్.. అందరికంటే ముందు చావు వచ్చేది కాంగ్రెస్ కే అన్నారు.

హామీల అమలుపై సభలో చర్చ జరక్కుండా సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. డైవర్షన్ పాలిటిక్స్ ఆపి ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ ను డిమాండ్ చేశారాయన. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు ఇచ్చారు.. వెయ్యి రోజులు అయినా 6 గ్యారెంటీలు అమలు చేయలేదన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఎప్పుడిస్తారు? అని నిలదీశారు.

అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. అవి ఎప్పుడు ఇస్తారు? అని ప్రశ్నించారు. తమ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలు సబిత, సునీతా లక్ష్మారెడ్డిపై దాడి జరిగితే చర్యలు తీసుకోలేదన్నారు. తిరిగి వారిపైనే కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి గౌరవ సభను కౌరవ సభగా మార్చారని మండిపడ్డారు హరీశ్ రావు. మహిళా ఎమ్మెల్యేలపై దాడికి సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలన్నారు.

ఎమ్మెల్యే శంకర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి

కేసీఆర్ చావు కోరుకున్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శాసనసభలో తీర్మానం చేయాలన్నారు. ప్రతిపక్ష నేత చావును కోరుకునేలా మాట్లాడుతుంటే స్పీకర్ కు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రేరేపించడం వల్లే ఎమ్మెల్యే శంకర్ అలా మాట్లాడారని చెప్పారు.

రేవంత్ రెడ్డి ప్రేరేపించిన మాటలు

''నిత్యం చావు భాష మాట్లాడే రేవంత్ రెడ్డి.. ఇవాళ తన పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ చావాలని మాట్లాడిస్తున్నారు. కేసీఆర్ చావాలి. కేసీఆర్ దరిద్రము. చనిపోతే పీడ పోతుందని షాద్ నగర్ ఎమ్మెల్యే అన్నారు. అవి కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు కావు. అవి రేవంత్ రెడ్డి ప్రేరేపించిన మాటలు. ఇవాళ కేసీఆర్ చావుని కోరుతూ మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై వెంటనే అసెంబ్లీలో తీర్మానం పెట్టాలి, ఆయన శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలి.

ముఖ్యమంత్రి తర్వాత ఆ స్థానం ప్రతిపక్ష నాయకుడిది. అలాంటి ప్రతిపక్ష నాయకుడి చావుని కోరుకునే విధంగా సభలో ఉండే సభ్యుడే మాట్లాడుతుంటే స్పీకర్ కి కనిపించడం లేదా? వినిపించడం లేదా? స్పీకర్ దీని మీద ఎందుకు చర్య తీసుకోరు? దీని మీద ఎందుకు చర్చ పెట్టరు? ఎందుకు ఆ ఎమ్మెల్యేని బహిష్కరించకూడదు?'' అని హరీశ్ రావు ప్రశ్నించారు.

#KTR#Brs#Telangana Assembly#Cm Revanth Reddy#Kcr#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి