తెలంగాణ

Nalgonda: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టీచర్ పోస్టులకు నోటిఫికేషన్.. అర్హతలు ఇవే!

రచన: Venu••4 నిమిషాల పఠనం

నల్గొండ జిల్లాలో డిగ్రీ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, పీజీటీ, టీజీటీ విభాగాల్లో మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 22 న సాయంత్రం 5 గంటల వరకు నల్గొండలోని మహిళా సమాఖ్య భవన్​లో ఉన్న ప్రాంతీయ సమన్వయాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

నిరుద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. నల్గొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలోని గిరిజన గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు..

ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాలో డిగ్రీ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, పీజీటీ, టీజీటీ విభాగాల్లో మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 22 న సాయంత్రం 5 గంటల వరకు నల్గొండలోని మహిళా సమాఖ్య భవన్​లో ఉన్న ప్రాంతీయ సమన్వయాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

మరోవైపు ఈ నెల 24న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బాలుర గురుకుల పాఠశాల, అవంతిపురంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు తెలిపారు. డిగ్రీ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, పీజీటీ, టీజీటీ విభాగాల్లో మొత్తం 27 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డిగ్రీ లెక్చరర్లు 2 పోస్టులు, జూనియర్ లెక్చరర్లు 11 పోస్టులు, పీజీటీ 5 పోస్టులు, టీజీటీ 7 పోస్టులు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 2 పోస్టులకు సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్టు వివరించారు..

పీజీటీ, టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో పాటు బీఈడీలో 50 శాతం మార్కులు సాధించి, టెట్‌ పార్ట్‌–2లో అర్హత పొంది ఉండాలి. జేఎల్‌ పోస్టులకు పీజీ లేదా డిగ్రీలో 55 శాతం మార్కులతో పాటు బీఈడీలో 55 శాతం మార్కులు, టెట్‌ పార్ట్‌–2 అర్హత తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్న అధికారులు..

డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు పీజీ లేదా డిగ్రీలో 55 శాతం మార్కులతో పాటు పీహెచ్‌డీ, నెట్‌ లేదా సెట్‌లో ఏదో ఒక అర్హత కలిగి ఉండాలని తెలిపారు. సూర్యాపేట జిల్లాలో అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్‌ చేసి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 83339 25379 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

#Telangana#Nalgonda#Notification#teacher posts#eligibility
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి