International

Donald Trump: కిమ్‌తో దోస్తీకి సిద్ధంగా ట్రంప్.. సౌత్ కొరియాకు భారీ షాక్!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఎవరికీ అంతుచిక్కదు. తాజాగా ఆయన మరో సంచలన నిర్ణయంతో అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు తెరతీశారు. దక్షిణ కొరియాతో కలిసి ఏటా నిర్వహించే ఉమ్మడి సైనిక విన్యాసాల పరిమాణాన్ని గణనీయంగా తగ్గించాలని డిసైడ్ అయ్యాడు. ఈ మేరకు పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్‌సెత్‌ను ఆదేశించారు. ఈ మిలిటరీ డ్రిల్స్ అత్యంత ఖర్చుతో కూడుకున్నవని ట్రంప్ పేర్కొన్నాడు.

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో తనకు అద్భుతమైన సంబంధాలు ఉన్నాయని, ఈ విన్యాసాలు ప్యోంగ్యాంగ్‌కు అనవసర శత్రుత్వ సంకేతాలను పంపుతున్నాయని అభిప్రాయపడ్డారు. అమెరికా-దక్షిణ కొరియా సైన్యాల మధ్య వార్షిక ‘ఉల్చి ఫ్రీడమ్‌ షీల్డ్‌’ (Ulchi Freedom Shield) సైనిక విన్యాసాలు సోమవారం ప్రారంభమై ఆగస్టు 27 వరకు కొనసాగనున్నాయి. ఈ విన్యాసాలలో దాదాపు 18వేల మంది దక్షిణ కొరియా సైనికులు పాల్గొంటున్నారు. ఈ విన్యాసాలను పూర్తిగా రద్దు చేసే సమయం మించిపోయినందున, వాటి పరిధిని, తీవ్రతను గణనీయంగా తగ్గించాలని ఆదేశించినట్లు ట్రంప్ స్పష్టం చేశారు.

ఈ కసరత్తుల్లో డ్రోన్ దాడులను తిప్పికొట్టడం, జీపీఎస్ సంకేతాల నిరోధం, సైబర్ సెక్యూరిటీ సవాళ్లను ఎదుర్కోవడంపై శిక్షణ ఇస్తున్నారు. అయితే, ఈ నిర్ణయం వెనుక ఇరాన్ అంశం కూడా ఉందని ట్రంప్ వెల్లడించడం గమనార్హం. ఇరాన్ అణు నిరాయుధీకరణ ప్రయత్నాల్లో అమెరికాకు సహకరించాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్‌ను కోరగా, ఆయన నిరాకరించారని ట్రంప్ తెలిపారు. ఇరాన్ విషయంలో దక్షిణ కొరియా వైఖరి కూడా ఉమ్మడి సైనిక విన్యాసాల తగ్గింపు నిర్ణయానికి దారితీసిందని ఆయన వ్యాఖ్యానించారు.

ఉత్తర కొరియా ఎప్పటి నుంచో ఈ విన్యాసాలను తమపై యుద్ధానికి చేసే సన్నాహాలుగా అభివర్ణిస్తూ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం దక్షిణ కొరియాకు పెద్ద ఆందోళన కలిగించే అంశంగా మారగా, కిమ్ జోంగ్ ఉన్‌తో సంబంధాలను పునరుద్ధరించుకునేందుకే అమెరికా అధ్యక్షుడు ఈ అడుగు వేశారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

#Donald Trump#Kim Jong Un#South Korea#North Korea#Ulchi Freedom Shield#Pentagon#Pete Hegseth#Lee Jae Myung#US South Korea Military Drills#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి