సినిమా

Srinidhi Shetty: ఆదర్శ కుంటుంబమే ఆఖరి సినిమానా?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి చేతిలో ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా ఉంది. అది కూడా తెలుగులో చేస్తున్న సినిమా. మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుస్తున్న సినిమా ఇది. ఇందులో, వెంకీ సరసన శ్రీనిధి హీరోయిన్‌గా నటిస్తోంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలా ఉంటాయో కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా చూపించబోతున్నాడు గురూజీ.

అయితే, ప్రస్తుతం శ్రీనిధి పరిస్థితి చూస్తుంటే చేతిలో ఉన్న ఈ ఆదర్శ కుంటుంబం చిత్రమే ఆఖరి సినిమాలా కనిపిస్తోంది. కేజీఎఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా వైడ్‌గా పాపులారిటీని అందుకొని, క్రేజ్ తెచ్చుకుంది ఈ కన్నడ భామ. వాస్తవానికి, కేజీఎఫ్ పార్ట్ 1 భారీ హిట్ తర్వాత వరుసగా అరడజను సినిమాలలో ఆఫర్స్ వచ్చాయని, హ్యూజ్ రెమ్యునరేషన్ డిమాండ్ చేసి వాటిని వదులుకుందని అప్పట్లో ప్రచారం జరిగింది.

ఆ తర్వాత, తెలుగులో మన నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హిట్ 3 మూవీలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో శ్రీనిధి పర్ఫార్మెన్స్‌తో బాగా ఆకట్టుకుంది. అయితే, ఆశించిన విజయం మాత్రం దక్కలేదనే చెప్పాలి. దీని, తర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా 'తెలుసు కదా' అనే సినిమా చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా మిగిలింది. దాంతో, అమ్మడికి సౌత్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు.

వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం మూవీలో ఛాన్స్ రావడం నిజంగా శ్రీనిధి లక్కే. ఇప్పటి వరకూ ఈ మూవీ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ బాగానే హై తీసుకొచ్చింది. ఈ ఒక్క సినిమా తప్ప కొత్తగా శ్రీనిధి సైన్ చేసిన సినిమాలేవీ కనిపించడం లేదు. ఈ మూవీ సక్సెస్ అయి హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు దక్కితేనే తర్వాత అవకాశాలను అందుకుంటుంది. లేదంటే కమర్షియల్ యాడ్స్‌కి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది.

#Aadarsha Kutumbam#Srinidhi Shetty#Venkatesh#trivikram
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి