క్రైమ్

Crime : హైదరాబాద్‌లో ఘోరం.. గోనె సంచిలో యువతి బాడీ!

రచన: Kumar•••3 నిమిషాల పఠనం

హైదరాబాద్ మహానగరంలో మరో భయానక ఘటన వెలుగుచూసింది. ఓ ఇంట్లోని గోనె సంచిలో యువతి మృతదేహం లభ్యమైంది. పక్కింట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు వెళ్లి చూడగా.. సంచి మూటకట్టి ఉండటాన్ని గమనించారు.

హైదరాబాద్ మహానగరంలో మరో భయానక ఘటన వెలుగుచూసింది. ఓ ఇంట్లోని గోనె సంచిలో యువతి మృతదేహం లభ్యమైంది. పక్కింట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు వెళ్లి చూడగా.. సంచి మూటకట్టి ఉండటాన్ని గమనించారు. దాని మీద రక్తపు మరకలు ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకుని పరిశీలించగా.. గోనె సంచిలో యువతి మృతదేహం కనిపించడంతో అంతా షాక్ అయ్యారు.

వివరాల్లోకి వెళితే.. బిహార్ రాష్ట్రానికి చెందిన యువతి, యువకుడు నగరానికి వలసవచ్చారు. బాలాపూర్ పరిధిలోని బిస్మిల్లా కాలనీలో నివాసం ఉంటున్నారు. కాలనీలో అద్దెకు దిగే సమయంలో వారి పేర్లు రెహానా, మమ్మద్ సలామ్‌గా చెప్పినట్టు సమాచారం. వీరికి పెళ్లి జరిగినట్టు కూడా పేర్కొనట్టు తెలుస్తోంది. వాస్తవానికి వీరిద్దరూ తమ స్వరాష్ట్రం నుంచి పారిపోయినట్టు వచ్చినట్టు సమాచారం.

ఇరువురు ప్రేమించుకుని ఇంట్లోవారికి చెప్పకుండా పారిపోయి నగరానికి వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్టు తెలుస్తుండగా.. తనను పెళ్లి చేసుకోవాలని రెహానా..మహ్మద్ సలామ్‌ను కొంత కాలంగా కోరుతోంది. పదే పదే దాటవేస్తూ వచ్చిన సలామ్.. చివరకు అతన్ని రెహానా ఒత్తిడి చేయడంతో ఆగ్రహంతో ప్రియురాలని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసినట్టు సమాచారం.

అనంతరం ప్రియురాలి డెడ్ బాడీని గోనె సంచిలో మూట కట్టిన ప్రియుడు..అక్కడి నుంచి పరార్ అయినట్టు తెలిసింది. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.స్వరాష్ట్రం బిహార్ పారిపోయి ఉంటాడా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్టు సమాచారం.

https://x.com/TeluguScribe/status/2089201209462972513?s=20

#dead body#jute bag#pakked#girl#hyderabad#love#crime
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి