తెలంగాణ

కేజీబీవీలో ఫుడ్ పాయిజన్.. 18మంది విద్యార్థినులకు అస్వస్థత!

రచన: Mamatha puppala••5 నిమిషాల పఠనం

సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడం తీవ్ర కలకలం రేపింది. పాఠశాలలో రాత్రి భోజనం చేసిన అనంతరం విద్యార్థినులు ఒక్కసారిగా కడుపునొప్పి, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. ఒకేసారి 18 మంది బాలికలు తీవ్ర తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో పాఠశాల ప్రాంగణంలో భయాందోళనలు నెలకొన్నాయి.

సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడం తీవ్ర కలకలం రేపింది. పాఠశాలలో రాత్రి భోజనం చేసిన అనంతరం విద్యార్థినులు ఒక్కసారిగా కడుపునొప్పి, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. ఒకేసారి 18 మంది బాలికలు తీవ్ర తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో పాఠశాల ప్రాంగణంలో భయాందోళనలు నెలకొన్నాయి.

ఘటనను గమనించిన పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు వెంటనే స్పందించి అస్వస్థతకు గురైన విద్యార్థినులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు విద్యార్థినులకు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. భోజనంలో నాణ్యతా లోపాలు, శుభ్రత పాటించకపోవడం వల్లే ఈ ఫుడ్ పాయిజన్ జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న విద్యాశాఖ, రెవెన్యూ అధికారులు ఆసుపత్రికి చేరుకుని విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు.

భోజనం నాణ్యతపై విచారణ జరిపి, బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం విద్యార్థినులందరూ ప్రాణపాయం నుంచి బయటపడి కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టి పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

తరచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు

తెలంగాణలోని వివిధ గురుకుల పాఠశాలల్లో తరచూ ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు వెలుగుచూస్తుండటం విద్యార్థులు, వారి తల్లిదండ్రులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మౌలిక సదుపాయాల కొరత, పారిశుధ్య లోపాలు, భోజన తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలవుతున్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ విద్యాసంస్థల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో నిరంతర తనిఖీలు చేపట్టాలి. అదేవిధంగా, బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటూ సరుకుల నాణ్యత, వంటశాల పరిశుభ్రతపై పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

 

#Siddipet Food Poison#KGBV Maddur#Telangana Gurukula#Student Illness#Maddur Kasturba School#Siddipet News#Food Poisoning Case#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి