తెలంగాణ

TG : నేడు ‘టిమ్స్’ ఆస్పత్రిని ప్రారంభించనున్న సీఎం రేవంత్..

రచన: Kumar••4 నిమిషాల పఠనం

హైదరాబాద్ మహానగరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సనత్ నగర్‘టిమ్స్’ ఆస్పత్రిని సీఎం రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. ఆయన వెంట ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహా, ఇతర మంత్రులు, ముఖ్య అధికారులు సైతం పాల్గొంటారని సమాచారం.

హైదరాబాద్ మహానగరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సనత్ నగర్‘టిమ్స్’ ఆస్పత్రిని సీఎం రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. ఆయన వెంట ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహా, ఇతర మంత్రులు, ముఖ్య అధికారులు సైతం పాల్గొంటారని సమాచారం. టిమ్స్ ఆస్పత్రి నిర్మాణం పూర్తయి చాలా రోజులు గడుస్తున్నా ప్రారంభం మాత్రం కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టిమ్స్ ఆస్పత్రులకు శంకుస్థాపన జరిగింది. రాష్ట్రంలోని ప్రజలు ఏదైనా మేజర్ అనారోగ్య సమస్యలు తలెత్తితే హైదరాబాద్‌కు రాక తప్పడం లేదు. నగరంలోకి రోగులు ఎంట్రీ సమయంలో ఫుల్ ట్రాఫిక్ వలన చాలా వరకు ప్రాణాల మీదకు వస్తుంది. దీంతో నాటి సీఎం దూరదృష్టితో ఇక మీదట మెరుగైన వైద్యం కోసం వచ్చే రోగులు సిటీలోనికి రాకుండా ఉండేందుకు పలు టిమ్స్ ఆస్పత్రులకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రి ప్రారంభానికి సిద్ధంగా ఉండగా.. అల్వాల్ వద్ద మరో టిమ్స్ హాస్పిటల్ పూర్తయ్యే దశలో ఉన్నది.

ఈ క్రమంలోనే సనత్ నగగ్ టిమ్స్ హాస్పిటల్‌ నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద ప్రారంభం కానుంది. ఇందులో గుండె ఆపరేషన్స్ నుంచి అత్యాధునిక వైద్యపరికరాలతో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించనున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ టిమ్స్ ఆస్పత్రులు నడుస్తాయి. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నది.

సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రిని రూ.1,126 కోట్ల వ్యయంతో 1,082 పడకలతో నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఇందులో అవయవ మార్పిడి కోసం రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రత్యేక ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌ను సైతం ఏర్పాటు చేశారు.పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రయివేటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతో సమానంగా ఇందులో ట్రీట్మెంట్ లభించనుంది. అందుకోసం ప్రత్యేకంగా వైద్యరంగానికి నిధులు కేటాయించనున్నట్టు సమాచారం. కాగా, ప్రస్తుతం సనత్ నగర్ టిమ్స్‌లో ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చి ఆరు నెలలు కావొస్తుంది.

https://x.com/TeluguStride/status/2089195472816918622?s=20

#TIMS hospital#opening#today#cm revanth reddy#hyderabad
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి