Chiranjeevi: మెగాస్టార్ లుక్ విషయంలో నెగిటివ్ కామెంట్స్..అయినా తగ్గడంలేదు. అవును..మన శంకరవరప్రసాద్‌గారు సినిమా విషయంలో చాలానే నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. మీసాల పిల్ల సాంగ్‌లో చిరు ముఖం ఏమో యంగ్‌గా.. చేతులేమో వయసు తెలిసిపోతున్నట్టుగా ఉన్నాయని సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ చేశారు. నిజం చెప్పాలంటే మన సీనియర్ హీరోలు వయసుకు తగ్గ పాత్రలను చేయడం లేదు.
ఇంకా, హీరోయిన్..డ్యూయెట్స్, రొమాన్స్ అంటూ కుర్ర హీరోల్లా ప్రవర్తిస్తున్నారు. ఎంత అభిమానుల కోసం సినిమా చేసినప్పటికీ కాస్త వయసు కూడా చూసుకోవాలి. అందుకే, హీరోల పక్కన కాస్త వయసు తక్కువగా ఉన్న హీరోయిన్ కనిపిస్తే వెంటనే కామెంట్స్ పడిపోతున్నాయి. చిరు, నాగార్జున, వెంకీలలో కాస్త బాలయ్య నయం. భగవంత్ కేసరి లాంటి సినిమాలను ఒప్పుకుంటున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న మెగా 158 ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హీరోయిన్‌గా ప్రియమణి, కీలక పాత్రలో అనస్వర రాజన్, మురళీ శర్మ నటిస్తున్నారు. వచ్చేవారం నుంచి చిరంజీవిపై సాంగ్ ప్లాన్ చేశాడట బాబీ. దీనికోసం మెగాస్టార్ లుక్ మొత్తం మార్చినట్టుగా తెలుస్తోంది. వింటేజ్ మెగాస్టార్ కనిపిస్తాడట. ఇందుకు చిరు ప్రత్యేకంగా తయారవుతున్నాడట.
అయితే, వింటేజ్ లుక్ అని ఫ్యాన్స్‌ని ఊరించి ఏదో ట్రై చేస్తున్నారు గానీ, నిజంగా అంత యంగ్ లుక్ లో చూపించడం చాలా కష్టం. దీనికే, నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఉన్న వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటే అభిమానులే కాదు, ప్రతీ ఒక్కరు సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తారు. పైగా ఇలా యంగ్ లుక్ అంటే మొహానికి ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తుందట. దానీ, ప్రభావం ఒక వారం మాత్రమే ఉంటుందట. ఇన్ని, అవస్థలు ఎందుకు మరి.


