National

Kisan Credit Card: రైతన్నలకు కేంద్రం గుడ్‌న్యూస్.. కిసాన్ క్రెడిట్ కార్డ్‌పై బంపర్ ఆఫర్!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి మద్దతుగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి శ్రీకారం చుడుతోంది. సాగు ఖర్చుల కోసం రైతన్నలకు తక్కువ వడ్డీకే రుణాలను అందించే ప్రతిష్టాత్మక ‘కిసాన్ క్రెడిట్ కార్డ్’ (KCC) పథకాన్ని 2031-32 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించేందుకు మోదీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి మద్దతుగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి శ్రీకారం చుడుతోంది. సాగు ఖర్చుల కోసం రైతన్నలకు తక్కువ వడ్డీకే రుణాలను అందించే ప్రతిష్టాత్మక ‘కిసాన్ క్రెడిట్ కార్డ్’ (KCC) పథకాన్ని 2031-32 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించేందుకు మోదీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎలాంటి పూచీకత్తు (గ్యారెంటీ) లేకపోయినా అర్హులైన రైతులకు సులభంగా లోన్లు అందించడమే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు అధికారిక వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

 రైతుల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఇటీవల కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచింది. ప్రస్తుతం ఈ పథకం కింద 7 శాతం వడ్డీ రేటుతో రుణాలు లభిస్తుండగా, సకాలంలో ప్రాంప్ట్‌గా రీపేమెంట్ చేసే రైతులకు ప్రభుత్వం 3 శాతం అదనపు వడ్డీ రాయితీని కల్పిస్తోంది. దీనివల్ల నిబద్ధత కలిగిన రైతులకు కేవలం 4 శాతం సబ్సిడీ వడ్డీ రేటుకే రుణాలు అందుతున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఈ పథకానికే ఏకంగా రూ.22,600 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

ప్రస్తుతం వడ్డీ రాయితీకి సంబంధించిన నిబంధనల్లో కొన్ని మార్పులు చేసేందుకు ప్రభుత్వం బ్యాంకింగ్ వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేట్లలో మార్పులు చేయడం, ఎంసీఎల్ఆర్ (MCLR) రేట్లు తగ్గడం వల్ల వడ్డీ రాయితీని స్వల్పంగా (50 బేసిస్ పాయింట్ల మేర) సవరించాలని భావిస్తోంది. గతంలో ప్రభుత్వ బ్యాంకులు ఇచ్చే 1.5 శాతం వడ్డీ సబ్సిడీ సదుపాయాన్ని గడువు ముగియడంతో మరింత కాలం సవరించి పొడిగించే దిశగా చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి.

ఈ పథకం పొడిగింపు వల్ల కోట్లాది మంది చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి కష్టాలు తీరనున్నాయి. వడ్డీ వ్యాపారుల చక్రవడ్డీ ఊబిలో చిక్కుకోకుండా, బ్యాంకుల ద్వారానే నేరుగా తక్కువ వడ్డీకి రూ.5 లక్షల వరకు రుణం పొందే వెసులుబాటు కలగనుంది. త్వరలోనే ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసి అధికారిక ప్రకటన విడుదల చేయనుండటంతో దేశవ్యాప్తంగా ఉన్న కర్షక లోకం హర్షం వ్యక్తం చేస్తోంది.

 

#Kisan Credit Card 2026#KCC Scheme Extension 2032#PM Modi Kisan Loan#Farmers 5 Lakh Loan#RBI Repo Rate KCC#Agriculture Loans India#Kisan Credit Card Subsidy#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి