తెలంగాణ

TG : పల్లెవాసులకు శుభవార్త.. బస్సుల నైట్‌హాల్ట్‌కు రైట్ రైట్

రచన: Kumar••4 నిమిషాల పఠనం

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. మెరుగైన రవాణా సేవలు కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు పల్లెల్లో రాత్రి ఆర్టీసీ బస్సులు బస చేసేవి. ఉదయాన్నే మరల గమ్యస్థానానికి చేరేవి. ప్రయాణికులకు సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చివి. దశాబ్దకాలం పాటు ఈ సేవలు నిలిచిపోగా.. మరోసారి ఆ సేవలను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల్లోని మారుమూల పల్లెల్లో ఈ బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. డిపోల నుంచి బయలు దేరిన బస్సులు తమకు కేటాయించిన పల్లెల్లోని ప్రధాన చౌరస్తా లేదా పాయింట్ వద్ద రాత్రి బస చేయాల్సి ఉంటుంది. ఉదయాన్నే ప్రయాణికులతో మరల సంబంధింత జిల్లా, పట్టణ బస్ స్టేషన్లకు చేరుకోవాల్సి ఉంటుంది. పల్లెల నుంచి ఉద్యోగాలు, చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు ఈ సర్వీసులు ఎంతోగానో ఉపయోగపడతాయి.

దశాబ్దంన్నర తర్వాత పల్లెల్లో మళ్లీ బస్సులు తిరగనున్నాయని, రాత్రి అక్కడే బస చేస్తాయని తెలియడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఉదయాన్నే తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని సంతోషపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహాలక్ష్మి స్కీం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ బస్సుల్లోనూ ఉచిత టికెట్ వర్తించనుంది. మహిళలు ఎప్పటిలాగే ఎక్స్‌ప్రెస్ బస్సు వరకు ఫ్రీ టికెట్‌తో ట్రావెల్ చేయవచ్చు.

https://x.com/SakshiNews/status/2089159651971727598?s=20

కనీసం 2 వేల బస్సులకు నైట్‌హాల్ట్‌ డ్యూటీ వేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా వ్యవస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రకటించింది. ‘స్మార్ట్‌ షెడ్యూలింగ్‌’ పేరుతో ఈ మేరకు భారీ కార్యాచరణ చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇక వచ్చే నెల నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది.

#night hault#rtc buses#villages#telangana#tgsrtc
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి