తెలంగాణ

TG : నీళ్ల కోసం ఎస్సై కాళ్లు పట్టుకున్న అన్నదాత.. వీడియో వైరల్!

రచన: Kumar••4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో వర్షాలు లేక మరో వైపు సాగుకు ప్రభుత్వం నీళ్లు ఇవ్వకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అయితే, ఎల్ నిన్ ఎఫెక్ట్ కారణంగా వర్షాకాలం అయినా వానలు పడటంలేదు.

రాష్ట్రంలో వర్షాలు లేక మరో వైపు సాగుకు ప్రభుత్వం నీళ్లు ఇవ్వకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అయితే, ఎల్ నిన్ ఎఫెక్ట్ కారణంగా వర్షాకాలం అయినా వానలు పడటంలేదు. రైతులు ఏమో వరి వేసేందుకు సిద్ధం అవుతుండగా..ప్రభుత్వం మాత్రం పంట మార్పిడి చేయాలని, వర్షాలు లేనందున ఆరు తడి పంటలు మాత్రమే వేయాలని చెబుతోంది. రైతులకు నీళ్లివ్వాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటు కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయాలని కోరుతోంది.

ఎత్తిపోసిన నీటిని రైతులకు సాగు కోసం ఇవ్వాలని అడుగుతోంది. అయితే, నీటిని లిఫ్టింగ్ చేస్తే మేడిగడ్డ బ్యారేజీతో పాటు సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు సైతం కొట్టుకుపోతాయని సర్కారు చెబుతోంది.ఎన్‌డీఎస్ఏ నివేదిక ప్రకారమే కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయడం లేదని చెబుతోంది. వర్షాలు సమృద్ధిగా లేకపోవడంతో ప్రాజెక్టుల్లోనూ ఆశించిన స్థాయిలో నీరు రాలేదు. దీంతో విశ్రాంత ఇంజినీర్లు సైతం నీటిని ఎత్తిపోయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

అన్నదాతలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.ఇదిలాఉండగా, ఖమ్మం జిల్లాలో సాగు నీటి కోసం రైతులు రోడ్డెక్కారు. వైరా రిజర్వాయర్ నుంచి సాగునీరు విడుదల చేయాలని ఐబీ కార్యాలయం ముందు సోమవారం ఉదయం రైతులు నిరసన ప్రదర్శన చేపట్టారు. రిజర్వాయర్‌లో 17 అడుగుల నీరు ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం విడుదల చేయడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరసనను అడ్డుకోవడానికి వచ్చిన ఎస్సై కాళ్లపై పడిన ఓ రైతు.. నీటిని విడుదల చేయించాలని వేడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదిలాఉండగా, తమ భూములు గుంజుకుంటే పురుగుల మందు తాగి సచ్చిపోతామంటూ మరో రైతుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘యూరియా ఇవ్వరు, కరెంట్ బందు చేస్తారు, నీళ్ళు ఇవ్వరు, ఇప్పుడు భూమినే గుంజుకుంటామని అంటున్నారు. కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి రైతులకు బాధనే మిగిలింది’ అని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

https://x.com/TeluguScribe/status/2089248345760117136?s=20

https://x.com/TeluguScribe/status/2089244910948118796?s=20

#farmer#water#protest#sub inspector#legs hold#telangana
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి