సినిమా

Yash: "రామాయణ" కోసం ఇగోను పక్కన పెట్టాం

రచన: Anshu••3 నిమిషాల పఠనం

Yash: రామాయణ కోసం ఇగోను పక్కన పెట్టాం..అన్నాడు కన్నడ రాకింగ్ స్టార్ యష్. కేఫీఎఫ్ సిరీస్‌తో కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా యావత్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో అలాగే, ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ను తెచ్చుకున్నాడు. పాన్ ఇండియా లెవల్‌కి కన్నడ సినిమా వెళ్ళిందంటే అది, యష్-ప్రశాంత్ నీల్.. ఆ తర్వాత రిషబ్ శెట్టి వల్లే అని చెప్పాలి.

ఇప్పుడు, వీరద్దరికీ పాన్ ఇండియా వైడ్‌గా వచ్చిన పాపులారిటీ అసాధారణం. ఇటీవల యష్ నటించిన టాక్సిక్ సినిమా థియేట్రికల్ ట్రైలర్ బెంగుళూరులో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో యష్ రేంజ్ ఏంటో మరోసారి అర్థమైంది. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక, యష్ నటిస్తున్న మరో గొప్ప చిత్రం బాలీవుడ్‌లో రూపొందుతున్న రామాయణ. తాజాగా, యష్ ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇందులో, రావణాసుడి పాత్రను ఎందుకు ఎంచుకున్నాడో చెప్పాడు. హీరో బలంగా ఉండాలంటే విలన్ అంతకన్నా బలంగా ఉండాలి. రాముడు మంచితనాన్ని, గుణగణాలను చూపించాలంటే రావణుడిగా నేను బాగా నటించాలి. విలన్ పాత్రలు చేసినా నావంతు బాగా నటించడానికే కృషి చేస్తాను. రామాయణ కోసం మేమంతా ఇగోను పక్కన పెట్టాము.. అని అన్నాడు.

కాగా, ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి, శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్, రావణ పాత్రలో యష్ నటిస్తున్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహించాడు. రెండు భాగాలుగా రామాయణ రూపొందుతోంది. మొదటి భాగాన్ని ఈ ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. ఇక, రెండవ భాగాన్ని వచ్చే ఏడాది (2027) దీపావళికి రిలీజ్ చేయనున్నారు.

#yash#ramayana#ravana#ranbeerkapoor#nithish tiwari#saipallavi
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి