క్రైమ్

jogi Ramesh: సంచలనంగా మారిన జోగి కుటుంబ వ్యవహారం.. వైరల్ అవుతున్న రాజీవ్ వ్యాఖ్యలు!..

రచన: Venu•••3 నిమిషాల పఠనం

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు జోగి కుటుంబానికి సంబంధించిన ఓ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోలో రాజీవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు జోగి కుటుంబానికి సంబంధించిన ఓ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోలో రాజీవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన పెళ్లి విషయంలో తనకు ఇష్టం లేకపోయినా కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారని రాజీవ్ ఆరోపించినట్లు తెలుస్తోంది.

అమ్మాయి ఫొటో చూసినప్పుడే తనకు ఎలాంటి భావన కలగలేదని.. పెళ్లి తర్వాత పరిస్థితి మారుతుందేమోనని భావించినా.. చివరకు తాను దాంపత్య జీవితాన్ని కొనసాగించలేకపోయానని ఆయన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. తనకు లైంగిక పరమైన సమస్య ఉందని ముందే చెప్పినా.. కుటుంబ సభ్యులు తన మాట వినకుండా బ్రెయిన్‌వాష్ చేసి పెళ్లికి ఒప్పించారని రాజీవ్ ఆరోపణలు చేసినట్లు వైరల్ అవుతున్న ఆడియోలో వినిపిస్తుంది.

ఈ సందర్భంగా తండ్రి జోగి రమేష్, తల్లి శకుంతలపై కూడా రాజీవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. భార్య తరపు బంధువుల ముందే తన తండ్రిని ఉద్దేశించి..నువ్వు తప్పు చేశావ్ అంటూ ఆరోపణలు చేసినట్లు సమాచారం. మరోవైపు పరువు పోతుందనే ఆందోళనతో కుమారుడిని వారించే ప్రయత్నం చేసినా.. ఇక తాను మౌనంగా ఉండబోనని.. జరిగిన విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెబుతానని రాజీవ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో రాజీవ్ భార్య కూడా తన అత్తమామలను, భర్తను ప్రశ్నించారు.. మీరంతా తప్పు చేసి.. చివరికి తనను ఇంటి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశారని ఈ ఆడియోలో ఆమె ఆరోపించినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అసలు నిజాలు బయటకు వచ్చాయని.. తప్పెవరిదో తేలిపోయిందని ఆమె వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో ఆడియో వైరల్ అవుతుంది.

అయితే ఈ వ్యాఖ్యలపై సంబంధిత కుటుంబ సభ్యులు స్పందించవలసి ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారి.. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ లింక్ లో చూడవచ్చు..

#AP#Telangana#former-minister#Jogi ramesh#family#Rajiv comments#viral#violence
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి