బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటించారు. జేపీ నడ్డా స్థానంలో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్.. రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడం, పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా తన కొత్త టీమ్‌ను ఏర్పాటు చేశారు. కొత్త కార్యవర్గం ప్రకటన తక్షణమే అమల్లోకి వస్తుందని పార్టీ వెల్లడించింది.
కొత్త కార్యవర్గంలో 13 మంది జాతీయ ఉపాధ్యక్షులను నియమించారు. రాజస్థాన్‌కు చెందిన వసుంధర రాజే సింధియా, ఉత్తరాఖండ్‌కు చెందిన తీరథ్ సింగ్ రావత్, ఢిల్లీకి చెందిన రామ్ మాధవ్, ఒడిశాకు చెందిన బైజయంత్ జయ్ పండా, ఆంధ్రప్రదేశ్ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, ఉత్తరప్రదేశ్ నుంచి రేఖా వర్మ, గుజరాత్ నుంచి వర్షాబెన్ నరేంద్రభాయ్ దోషి..
మహారాష్ట్ర నుంచి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, పంజాబ్ నుంచి సర్దార్ మన్‌ప్రీత్ సింగ్ బాదల్, మధ్యప్రదేశ్ నుంచి లాల్ సింగ్ ఆర్యా, కర్ణాటక నుంచి ప్రొఫెసర్ ఎం. నాగరాజ్, ఉత్తరప్రదేశ్ నుంచి ప్రొఫెసర్ తారిఖ్ మన్సూర్, పశ్చిమ బెంగాల్ నుంచి డాక్టర్ మధుచంద్ర కర్‌లకు జాతీయ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించారు.
అయితే కొత్త జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చెందిన నేతలకు చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ నుంచి దగ్గుబాటి పురందేశ్వరికి మరోసారి కీలక బాధ్యత లభించింది. ఇక జాతీయ ప్రధాన కార్యదర్శులుగా వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, బిప్లబ్ కుమార్ దేవ్, స్మృతి ఇరానీ, సతీష్ పూనియా, గజేంద్ర పటేల్, హరీష్ ద్వివేది, సంజయ్ భాటియాలను నియమించారు.
ఆర్గనైజేషన్ బాధ్యతలను బీ.ఎల్. సంతోష్‌కు అప్పగించగా, జాయింట్ ఆర్గనైజేషన్ బాధ్యతల్లో శివప్రకాష్, శ్రీ సౌదాన్ సింగ్ కొనసాగనున్నారు. అలాగే జాతీయ కోశాధికారిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను నియమించారు. జాతీయ సహ-కోశాధికారిగా రాజేష్ మంగళ్, కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జ్‌గా తరుణ్ చుగ్, కేంద్ర కార్యాలయ కార్యదర్శిగా మహేంద్ర పాండే నియమితులయ్యారు.
ఈశాన్య రాష్ట్రాల కోఆర్డినేటర్‌గా డాక్టర్ సంబిత్ పాత్ర, జాయింట్ కోఆర్డినేటర్‌గా రాజీవ్ బబ్బర్‌కు బాధ్యతలు దక్కాయి. వివిధ విభాగాల సెల్స్ కోఆర్డినేటర్‌గా విష్ణు దత్ శర్మ, జాయింట్ కోఆర్డినేటర్లుగా రీతురాజ్ సిన్హా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విష్ణు వర్ధన్ రెడ్డిని నియమించారు.
ఇక వివిధ మోర్చాలకు కూడా కొత్త అధ్యక్షులను ప్రకటించారు. యువ మోర్చా అధ్యక్షుడిగా డాక్టర్ హేమాంగ్ జోషి, మహిళా మోర్చా అధ్యక్షురాలిగా రూప్ కుమారి చౌదరి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అమర్‌పాల్ మౌర్య, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా బన్సీలాల్ గుర్జర్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా శివేష్ కుమార్ రామ్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా డాక్టర్ మన్నా లాల్ రావత్, మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా కున్వర్ బాసిత్ అలీని నియమించారు.
జాతీయ కార్యదర్శుల జాబితాలో కవితా పాటిదార్, కె. సురేంద్రన్, డాక్టర్ భోలా సింగ్, డాక్టర్ ప్రదీప్ వర్మ, జగదీష్ ఈశ్వర్‌భాయ్ పటేల్, డాక్టర్ సందీప్ పాఠక్, ఫాంగ్నాన్ కోన్యాక్, సంగీతా యాదవ్, అనిల్ ఆంటోనీ, డాక్టర్ ఎం. వెంకటేశన్, మనోజ్ తిగ్గా, సిద్ధార్థ్ శంభు, డాక్టర్ స్వదేశ్ సింగ్, మృగాంక దేవ్ బర్మన్, రోహన్ గుప్తా, జై ప్రకాష్ ఉన్నారు. అదేవిధంగా మీడియా, సోషల్ మీడియా విభాగాల్లోనూ కీలక నియామకాలు జరిగాయి. మీడియా కన్వీనర్‌గా అనిల్ బలూని, కో-కన్వీనర్లుగా ఆశిష్ ఉషా అగర్వాల్, ప్రదీప్ భండారీ, సిద్ధార్థ్ యాదవ్ నియమితులయ్యారు.
సోషల్ మీడియా కన్వీనర్‌గా దీపక్ మస్కే, కో-కన్వీనర్లుగా ప్రీతి గాంధీ, శివానంద్ ద్వివేది, అలోక్ భట్, అరుణ్ యాదవ్ బాధ్యతలు చేపట్టనున్నారు. మొత్తంగా చూస్తే.. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అనుభవజ్ఞులు, రాష్ట్రాల వారీగా ప్రభావం ఉన్న నేతలు, సంస్థాగతంగా కీలకంగా పనిచేసే నాయకులతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తన కొత్త టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోంది. అయితే తెలంగాణ నుంచి ఒక్క నేతకూ చోటు దక్కకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.


