తెలంగాణ

TG : సీఎం, మంత్రి ఆదేశాలు బేఖాతర్.. ‘రెవెన్యూ’లో ఏం జరుగుతోంది?

రచన: Kumar••5 నిమిషాల పఠనం

రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 22ఏ నిషేధితా జాబితా భూముల గురించి చర్చ జరుగుతున్న సందర్భంలో ఓ వైపు సీఎం రేవంత్, మరోవైపు సంబంధిత రెవెన్యూ శాఖ మంత్రి బాధితులకు న్యాయం చేస్తామని చెబుతున్నా..క్షేత్రస్థాయిలో మాత్రం పనులు జరగడం లేదని సమాచారం.

రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 22ఏ నిషేధితా జాబితా భూముల గురించి చర్చ జరుగుతున్న సందర్భంలో ఓ వైపు సీఎం రేవంత్, మరోవైపు సంబంధిత రెవెన్యూ శాఖ మంత్రి బాధితులకు న్యాయం చేస్తామని చెబుతున్నా..క్షేత్రస్థాయిలో మాత్రం పనులు జరగడం లేదని సమాచారం. తమ పట్టా భూములను 22ఏ నిషేధితా జాబితాలో పెట్టారంటూ ప్రభుత్వం నుంచి ప్రయివేటు ఉద్యోగుల వరకు..రాజకీయ నాయకులు సైతం ఆరోపణలు చేస్తున్నారు.

రిజస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పనులు కావడం లేదని బాధితులు వాపోతున్నారు. తాజాగా తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్ కుమార్.. రెవెన్యూ శాఖలో జరుగుతున్న వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 22 ఏ విషయంలో సీఎం, రెవెన్యూ మంత్రి ఆదేశాలను జిల్లా రిజిస్టార్లు, సబ్ రిజిస్టార్లు పట్టించుకోవడం లేదని కుండబద్దలు కొట్టారు.

తమకు ఏ ప్లాట్, ఏ ఇండ్లు రిజిస్ట్రేషన్ చేయాలో, చేయకూడదో ఆన్‌లైన్‌లో పెడితేనే రిజిస్ట్రేషన్ చేస్తామని, లేకుంటే చేయబోమని బాధితులపై సబ్ రిజిస్టార్లు కసురుకుంటున్నారని పేర్కొన్నారు. ఉదా.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం పర్వతాపూర్ సాలార్జంగ్ కంచ 1, సర్వే నెంబర్‌లో 18 ఎకరాల భూమి ఉంటే.. అందులో 6 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. మిగతా ప్రవేట్ భూమిలోని ప్లాట్లు, ఇండ్లను రిజిస్ట్రేషన్ చేయడానికి అధికారులు నిరాకరిస్తున్నారు.

మూడు నెలల నుండి బాధితులు ముప్పు తిప్పలు పడుతున్నారని, పట్టించుకునే నాధుడే లేడన్నారు. మేడిపల్లి ఎమ్మార్వో సరైన రిపోర్టు ఇవ్వరని, సమస్య పరిష్కారం కాదని, లింకు డాక్యుమెంట్ ఉన్న ప్లాటు లేదా ఇండ్లను రిజిస్ట్రేషన్ చేద్దామని సబ్ రిజిస్టార్లు ప్రయత్నించడం లేదని ఫైర్ అయ్యారు.

ఇండ్లు కట్టుకొని 30, 40 ఏండ్ల గడిచిపోయిన తర్వాత ఇప్పుడు ULC సర్టిఫికెట్ అడగడం సిగ్గుచేటన్నారుే. కలెక్టర్ ఆదేశాలను కూడా సబ్ రిజిస్టార్లు పట్టించుకోవడం లేదని, తమకు లిఖితపూర్వక ఆదేశాలు కావాలంటూ పేచీ పెడుతున్నారని ఆరోపించారు. అక్రమ రిజిస్ట్రేషన్లకు మాత్రం లంచాలు తీసుకుని చేస్తున్నారని ఆరోపించారు. స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ కమిషనర్ గారికి తన శాఖలో ఏం జరుగుతుందో తెలియడం లేదని పేర్కొన్నారు.

NOCల కోసం బాధితులు మూడు నెలల నుండి చెప్పులు అరిగేలా తిరుగుతున్న ఇవ్వడం లేదని, వాటి మీద సంతకాలు పెట్టడానికి సతాయిస్తున్నారని ఫైర్ అయ్యారు.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రిజిస్టార్.. సబ్ రిజిస్టార్లకు సరైన ఆదేశాలు ఇవ్వకుండా తప్పుడు ఆదేశాలిస్తూ రిజిస్ట్రేషన్‌లను నిలుపుదల చేసేలా చేస్తున్నారని, జిల్లా రిజిస్టార్‌పై చర్య తీసుకుంటే తప్పా సమస్య పరిష్కారం కాదని నారగోని ప్రవీణ్ కుమార్ స్పష్టంచేశారు.

#lands#22A#prohibited lans#telangana#revenue department#Cm revanth#minister ponguleti
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి