సినిమా

Krish Jagarlamudi: సైలెంట్‌గా కానిచ్చేస్తున్న క్రిష్..

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Krish Jagarlamudi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడికి ఉన్న ఇమేజ్ కంప్లీట్‌గా వేరే. ఆయన తీసే సినిమాలు ఎంతో సృజనాత్మకంగా ఉంటాయి. గమ్యం సినిమాతో ప్రతీ ఒక్కరి దృష్టిని ఆకర్శించాడు క్రిష్. అప్పటి నుంచి ఆయన సినిమా అంటే ప్రైఇ ఒక్కరిలో ఎంతో ఆసక్తి నెలకొంటుంది. వేదం, కృష్ణం వందే జగద్గురం, కంచె, గౌతమీ పుత్ర శాతకర్ణి..ఇలా అన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలే.

కానీ, ప్రతీ ఒక్కరూ ఎంతో ఆతృతగా ఎదురుచూసిన సినిమా మాత్రం ఆయన కంప్లీట్ చేయలేకపోయాడు. అదే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు. పవన్ కెరీర్‌లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. ఫస్ట్ టీజర్ చూసి ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని చెప్పుకున్నారు. కానీ, పలు కారణాల వల్ల క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

ఈ సినిమా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో కరోనా వేవ్స్‌లోనూ కేవలం 40 రోజుల్లో కొండపొలం సినిమాను తీసి షాకిచ్చాడు. ఈ సినిమా ఫ్లాపై క్రిష్‌కి షాకిచ్చింది. ఆ తర్వాత వీరమల్లు నుంచి తప్పుకోవడం క్రిష్ కి అన్ని రకాలుగా దెబ్బ పడింది. ఆ తర్వాత ఎన్నో అంచనాలు పెట్టుకొని అనుష్క శెట్టితో ఘాటి సినిమాను తీశాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. దీంతో, ఇప్పుడు పెద్ద స్టార్స్ తో కాకుండా కొత్తవాళ్ళతో సినిమా చేస్తున్నాడు.

క్రిష్ దర్శకత్వంలో అంతా కొత్త వాళ్ళలో సినిమా రూపొందుతోంది. ‘జెంజ్ బ్యాచ్’ అనే వెరైటీ టైటిల్‌తో వస్తోన్న ఈ సినిమాకి సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రసాద్స్ ల్యాబ్‌లో జరుగుతున్నాయి. కానీ, ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ కూడా వదలకుండా చాలా సీక్రెట్‌గా ఈ మూవీని కంప్లీట్ చేస్తున్నాడు. మరికొన్ని రోజుల్లో ఫస్ట్ కాపీ రానుంది. మరి, ఈ సినిమాతోనైనా హిట్ కొట్టి క్రిష్ ఫాంలోకి వస్తాడా లేదా చూడాలి.

#Krish#Krish Jagarlamudi#Tollywood#Krish New Movie
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి