సినిమా

RAPO23: డే అండ్ నైట్ కష్టపడుతున్న ఎనర్జిటిక్ హీరో!

రచన: Anshu•••4 నిమిషాల పఠనం

RAPO23: టాలీవుడ్ లో ఎనర్జిటిక్ హీరోగా రామ్ పోతినేనికి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. కానీ, ఈ మధ్యకాలంలో ఆయనకి సరైన సక్సెస్ దక్కలేదు. ఇస్మార్ట్ శంకర్ లాంటి భారీ కమర్షియల్ హిట్ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలను అందుకోలేదు. రెడ్, ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ లాంటి సినిమాలన్నీ ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో పడ్డాయి.

గత చిత్రం ఆంధ్రాకింగ్ తాలూకా పేరుకు హిట్ టాక్ వచ్చినా కమర్షియల్‌గా మాత్రం సక్సెస్ కాలేదు. కథ-కథనాల లోపమే ఇందుకు కారణం. దీంతో, రామ్ పోతినేని తన 23వ సినిమాకి హీరోగా నటిస్తూనే దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. అంతేకాదు, ఈ సినిమా కోసం రెండు షిఫ్టుల్లో పనిచేస్తూ యూనిట్ సభ్యులకే షాకిస్తున్నాడు. హీరోలంటే షాట్ అయిపోగానే వెళ్ళి క్యారవాన్ లో రిలాక్స్ అవుతారు.

కానీ, రామ్ మాత్రం షాట్ అయిపోగానే వెళ్ళి మానీటర్ ముందు కూర్చొని అది ఎలా వచ్చిందో అని చూసుకుంటున్నాడు. అసలు రెస్ట్ అనేదే దొరకడం లేదట. డే అండ్ నైట్ షూట్స్‌లో చాలా బిజీగా ఉన్నాడు. ఈ మూవీ కోసం పాండిచ్చేరిలో భారీ సెట్ వేసి షూటింగ్ జరిపారు. అయితే, 9 రోజుల షూటింగ్ మాత్రమే పూర్తైంది. ఇంతలో అక్కడ భారీ వర్షాలు పడటంతో చేసేదేమీ లేక హైదరాబాద్ వచ్చేశారట.

మళ్ళీ, చిత్ర బృందం పాండిచ్చేరీ వెళ్ళబోతోంది. బ్యాలెన్స్ షూటిమంగ్ కంప్లీట్ చేసి వస్తారట. మొదటిసారి మెగా ఫోన్ పట్టిన రామ్ పోతినేని అస్సలు కాంప్రమైజ్ కావడం లేదట. ప్రతీ షీన్‌లో ఒక్కొక్క షాట్ పర్ఫెక్ట్‌గా వచ్చేవరకూ ఆర్టిస్టులను ఘానీ, టీమ్ ని గానీ వదలడం లేదటున్నారు. ఇక, రామ్ కమిట్‌మెంట్ చూసి ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోవడమే కాదు, ప్రశంసలు కురిపిస్తున్నారట. చూడాలి, రామ్మ్ మొదటి డైరెక్టోరియల్ మూవీ ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

#RAPO23#RamPothineni#Ram#UstadRam#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి