సినిమా

Dancer Shrasti Verma: బీజేపీలోకి శ్రష్ఠి వర్మ..ఇప్పుడే అవసరమా?

రచన: Anshu•••3 నిమిషాల పఠనం

Dancer Shrasti Verma: మన సినీ తారలు ఎంతోమంది రాజకీయాలలోకి వచ్చారు. కొందరు పార్టీ కూడా పెట్టారు. కొందరు పార్టీలో వివిధ శాఖల్లో నియమితులయ్యారు. కానీ, సినిమాలకి రాజకీయాలకి చాలా తేడా ఉంది. అందరూ రాజకీయాలలో ఇమడలేరు. దీనికి, ఉదాహరణ పోసాని కృష్ణమురళి, ఆలి లాంటి వారే. అంతకముందు కూడా మన సినీ తారలు చాలామంది ఇలా వెళ్ళి అలా వచ్చారు.

అలాంటిది, ఒక డాన్సర్ ఇప్పుడు రాజకీయాలలోకి ఎంటరవడం కాస్త ఊహించని పరిణామమే అనుకోవాలి. అసలు, ఎందుకు ఇప్పుడు, ఇంత చిన్న వయసులో రాజకీయాలలోకి రావాల్సి వచ్చింది. ఈమే చేసే సేవ ఏంటీ, రాజకీయాలలోకి రావడానికి ఆమెను ప్రేరేపించిన అంశాలేంటి, కారకులెవరు..? వీటికి సమాధానం దొరకాల్సి ఉంది.

ఇక, ఆగస్టు 17వ తేదీన హైదరాబాద్‌లోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని, అధికారికంగా బీజేపీలో చేరారు. బీజేపీ పార్టీ నేత రామచందర్‌రావు శ్రష్ఠి వర్మకి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక, నేడు శ్రష్టి వర్మతో పాటు కాస్టింగ్ డైరెక్టర్, నటుడు కిరణ్ సహా పలువురు యువతీయువకులు, సినీ పరిశ్రమకి చెందిన కళాకారులు కూడా బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు.

కాగా, గతంలో శ్రష్ఠి వర్మ ఢీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోలోనూ పాల్గొన్నది. అసోసియేట్ డాన్సర్‌గా, సొలో డాన్స్ కొరియోగ్రాఫర్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీతో వచ్చిన గొడవల గురించి అందరికీ తెలిసిందే. ఇలాంటి, సమయంలో శ్రష్టి ఇలా రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వడంపై కాస్త ఆసక్తికరమైన చర్చకి కారణమయింది.

#Dancer Shrasti Verma#Shrasti Verma#Shrasti Verma Into BJP
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి