సినిమా

Samantha: అందుకే నో చెప్పలేకపోయాను..!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Samantha: మా ఇంటి బంగారం సినిమాతో వచ్చి సాలీడ్ హిట్ కొట్టింది సమంత రాజ్. ఇక, సమంత పనైపోయింది..మళ్ళీ సినిమాలు చేయదు..అవకాశాలు ఎవరు ఇవ్వరు..ఇలాంటి కామెంట్స్ అన్నీ మా ఇంటి బంగారం మూవీ రాకముందు. అది, వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టడమే కాదు, ఏకంగా ఫీమేల్ సెంట్రిక్ మూవీ చేసిన హీరోయిన్స్‌లో 100 కోట్ల గ్రాస్ రాబట్టిన హీరోయిన్‌గా సమంత నిలిచింది.

Samantha: మా ఇంటి బంగారం సినిమాతో వచ్చి సాలీడ్ హిట్ కొట్టింది సమంత రాజ్. ఇక, సమంత పనైపోయింది..మళ్ళీ సినిమాలు చేయదు..అవకాశాలు ఎవరు ఇవ్వరు..ఇలాంటి కామెంట్స్ అన్నీ మా ఇంటి బంగారం మూవీ రాకముందు. అది, వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టడమే కాదు, ఏకంగా ఫీమేల్ సెంట్రిక్ మూవీ చేసిన హీరోయిన్స్‌లో 100 కోట్ల గ్రాస్ రాబట్టిన హీరోయిన్‌గా సమంత నిలిచింది.

అంతేకాదు, ప్రస్తుతం మెటర్నిటీ లీవ్ మాత్రమే తీసుకుంటున్నాను. గ్యారెంటీగా సినిమాలు చేస్తానని క్లారిటీ ఇచ్చింది. ఇక, సమంత భర్త రాజ్ నిడిమోరు..రెండేళ్ళలో మళ్ళీ మా ఇంటి బంగారం సినిమా సీక్వెల్ ఉంటుందని కన్‌ఫర్మ్ చేశాడు. దీంతో, సమంత నుంచి మరో రెండు మూడేళ్ళు సినిమా రాకపోవచ్చు గానీ, ఆమె స్మాల్ స్క్రీన్ మీద, టీవీ షోస్ ద్వారా మాత్రం కనిపిస్తూనే ఉంటాను అని చెప్పింది. అలాగే, నిర్మాతగా కూడా యాక్టివ్‌గానే ఉంటానని వెల్లడించింది.

ఇదిలా ఉంటే సమంత హోస్ట్‌గా తమిళంలో మాస్టర్ ఛెఫ్ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. దీనికి, సమంత హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల దీనికి సంబందించిన వార్తలు వచ్చాయి. ఇప్పుడు అధికారికంగా వెల్లడైంది. సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా తాజాగా ప్రకటించిన ఈ పాపులర్ కుకింగ్ షోను సోనీ విజా, సోనీ లివ్‌లలో ప్రసారం చేయనున్నారు. దీనికి సంబందించిన పోస్టర్ కూడా వదిలారు.

ఇక, ఈ సంద‌ర్భంగా సమంత.. “ఈ షో చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకూ నేను చేసిన ప్రోగ్రాంస్ లో ఇది చాలా డిఫరెంట్, అందుకే నో చెప్పలేకపోయాను అని చెప్పింది. ఫుడ్‌కు మనుషులను కలపడమే కాకుండా మనలోని మరో కొత్త షేడ్స్ ని బయటకు తీసే పవర్ ఉంది. తమిళ స్టార్స్ కిచెన్‌లో రిస్క్‌లు తీసుకుంటూ, ప్యాషన్‌తో పోటీపడటం చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నాను.

ఇక, ఈ కార్యక్రమంలో ఎవరెవరు ఉండబోతున్నారనేది సర్ ప్రైజ్. ఇక, సోనీ విళాతో కలిసి అందించబోయే ఈ ఫన్‌ను ఎంజాయ్ చేయండి.” అంటూ తెలిపింది సమంత. ఎటూ గర్భంతో ఉంది కాబట్టి..సినిమా అంటే కష్టం. అదే, ఇలాంటి షో అయితే ఇబ్బంది ఉండదు. కాబట్టి, ఈ ప్రోగ్రామ్ కి సమంత ఓకే చెప్పింది.

#samantha#master chef#samantha new journey#raj nidimoru
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి